కొంగొత్త ఆలోచనలకు అంకురం... ఇన్నొవేషన్‌ యాత్ర 2024! | Sakshi
Sakshi News home page

కొంగొత్త ఆలోచనలకు అంకురం... ఇన్నొవేషన్‌ యాత్ర 2024!

Published Mon, Mar 11 2024 4:47 PM

ACIC CBIT Kakatiya Sandbox Spark Innovation Yatra 2024 - Sakshi

అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్‌బాక్స్ నేతృత్వంలో.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ (TSIC) భాగస్వామ్యంతో 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' (Innovation Yatra - 2024) పేరుతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇందులో ఎలా పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు జరుగుతుందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..

ఇన్నోవేషన్ యాత్ర - 2024 రేపటితో ప్రారంభమై శనివారం వరకు (మార్చి 12 నుంచి 16) జరగనుంది. ఇందులో నవమ్ ఫౌండేషన్, ఎకో సిస్టం భాగస్వాములుగా Ag-Hub, అడ్వెంచర్ పార్క్, AIC-GNITS, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్లె సృజన మొదలైనవి భాగస్వాములుగా పాల్గొంటాయి.

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇన్నోవేషన్ యాత్ర 5 రోజులు, 60 మంది యాత్రికులు, 6 గమ్యస్థానాలు, 800 కి.మీ సాగుతుంది. ఇది ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనటానికి అప్లై చేసుకోవచ్చు. ఐదు రోజులు జరిగే ఈ బస్సు యాత్రలో పాల్గొనేవారు విజవయంతమైన వ్యవస్థాపకులు, లోకల్ ఇన్నోవేటర్స్‌తో సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రయాణంలో మంచి అనుభవాలు పొందటమే కాకుండా.. విలువైన విషయాలను తెలుసుకోగలుగుతారు.

ఈ యాత్రలో పాల్గొనేవారు తెలంగాణలోని విభిన్న కమ్యూనిటీలను కలుసుకోవడం, వారి ప్రత్యేకమైన అవసరాలు.. వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి లోతైన అవహగాన పొందటమే కాకుండా, వారి అనుభవాల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన మనస్తత్వం మీలో పెంపొందించుకోవడంలో ఈ యాత్ర తప్పకుండా తోడ్పడుతుంది.

ఇన్నోవేషన్ యాత్రలో వ్యక్తిగత అభివృద్ధికి అతీతంగా.. విభిన్న నేపథ్యాలకు చెందిన 59 యాత్రికులతో కనెక్ట్ అవుతారు. దీని ద్వారా మీకు కావలసిన జ్ఞానాన్ని పొందుతారు. సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కోవడానికి, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఈ యాత్ర ద్వారా సంపాదించవచ్చు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ఆవిష్కర్తల స్ఫూర్తిదాయకమైన కథలను ప్రదర్శించడం కూడా ఇందులో ఒక భాగం. వారు సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనేది యాత్ర లక్ష్యం.

Advertisement
Advertisement