Sakshi News home page

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.1,250 కోట్లు సమీకరణ

Published Fri, Jul 14 2023 6:11 AM

Adani Enterprises raises Rs 1250 crore through NCDs - Sakshi

న్యూఢిల్లీ: గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.1,250 కోట్లు సమీకరించినట్టు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదల అయిన తర్వాత, అదానీ గ్రూప్‌ కంపెనీ తొలిసారి రుణ మార్గంలో నిధులు సమీకరించడం గమనార్హం. రూ.లక్ష ముఖ విలువ కలిగిన 1,25,000 సెక్యూర్డ్, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ)ను ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ విధానంలో జారీ చేసినట్టు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సమాచారం ఇచి్చంది. ఎన్‌సీడీ రేటును సంస్థ ప్రకటించలేదు.

కానీ, ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం మూడేళ్ల ఎన్‌సీడీలపై 10 శాతం రేటు ఆఫర్‌ చేసి నిధులు సమీకరించినట్టు తెలుస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ చివరిగా గతేడాది సెపె్టంబర్‌లో బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించడం గమనార్హం. ప్రస్తుతం ఎన్‌సీడీలపై సంస్థ ఆఫర్‌ చేసిన 10 శాతం రేటు, ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ రేటు కంటే 3 శాతం అధికంగా ఉంది. వీటిపై అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏటా వడ్డీ చెల్లించనుంది. అదానీ గ్రూప్‌ షేర్ల ధరలు, కంపెనీల ఖాతాల్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్‌ సంస్థ సంచలన ఆరోపణలు చేయడం, దీన్ని అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించడం గుర్తుండే ఉంటుంది. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేస్తోంది. ఈ పరిణామాల తర్వాత అదానీ గ్రూప్‌ ప్రమోటర్లు కంపెనీల్లో స్వల్ప వాటాలను సీక్యూజీ పార్ట్‌న ర్స్‌కు ప్రైవేటుగా విక్రయించడం ద్వారా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం కూడా చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement