సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ‘పాపా’ | Sakshi
Sakshi News home page

Aditya L1 Mission: సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ‘పాపా’

Published Fri, Feb 23 2024 2:26 PM

Aditya L1 PAPA Detects Coronal Mass Ejections On Solar Wind - Sakshi

ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహంలోని ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్‌ ఆదిత్య(పాపా) పేలోడ్‌ విజయవంతంగా పనిచేస్తోందని ఇస్రో వెల్లడించింది. దీని అధునాతన సెన్సార్లు ఫిబ్రవరి 10, 11, 2024 తేదీల్లో సంభవించిన పరిణామాలతోపాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ల(సీఎమ్‌ఈ) ప్రభావాన్ని గుర్తించినట్లు ఇస్రో ట్విట్టర్‌లో తెలిపింది. 

పాపాలో రెండు సెన్సార్లు ఏర్పరిచారు. అందులో ఎలక్ట్రాన్‌లను కొలవడానికి సోలార్ విండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ ప్రోబ్ (స్వీప్‌), అయాన్‌లను కొలవడానికి సోలార్ విండ్ అయాన్ కంపోజిషన్ ఎనలైజర్ (స్వీకర్‌) ఉన్నాయి. రెండు సెన్సార్లు సౌర పవన కణాలు ఏ దిశ నుంచి వస్తున్నాయో గుర్తించగలవు.

ఈ సెన్సార్లు డిసెంబరు 12 నుంచి పనిలో ఉన్నట్లు ఇస్రో తెలిపింది. ఊహించిన విధంగా ప్రోటాన్లు, ఆల్ఫా కణాల కదలికను గుర్తించేలా ఒక స్పెక్ట్రాను రికార్డ్ చేసింది. జనవరి 6న ఆదిత్య-ఎల్‌1 హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ సమయంలో తాత్కాలికంగా పేలోడ్ ఓరియంటేషన్ మారినప్పుడు స్పెక్ట్రాలో కొంత డిప్ కనిపించినట్లు తెలిపింది.

ఇదీ  చదవండి: ‘ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం అదే..’

DSCOVR, ACE ఉపగ్రహాల ద్వారా డిసెంబర్ 15న వచ్చిన డేటాను ఇస్రో విశ్లేషించింది. ఆదిత్య ఎల్‌1లోని సీఎంఈ సెన్సార్లు L1 పాయింట్ వద్ద సౌర గాలి మార్పులకు అనుగుణంగా కణాల స్థానాల్లో మార్పులు గమనించినట్లు చెప్పింది. ఫిబ్రవరి 10, 11న కూడా సౌరగాలిలో స్వల్ప వ్యత్యాసాలు ఏర్పడినట్లు తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement