Budget 2024-25: సార్వత్రిక ఎన్నికలు.. ఈసీకి కేటాయింపులు ఇలా.. | Sakshi
Sakshi News home page

Budget 2024-25: బడ్జెట్‌లో ఎన్నికల సంఘానికి కేటాయింపులు ఇలా..

Published Fri, Feb 2 2024 11:30 AM

Allocations To Election Commission In The Budget - Sakshi

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయించారు. 

ఈ ఏడాది లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి 2024-25 బడ్జెట్‌లో కేంద్రం రూ.306.06 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో కేంద్రం రూ.385.67 కోట్లు ఇచ్చింది. అయితే ఈసారి బడ్జెట్‌లో ఈ నిధులు తగ్గించినట్లు తెలుస్తుంది. 

న్యాయమంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,502.30 కోట్లు ఇవ్వగా.. 2024-25లో రూ.34.84 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఈవీఎంల సేకరణ కోసం ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలోని శాసన విభాగం ఈసీకి సంబంధించిన ఎన్నికలు, ఎన్నికల చట్టాల అంశాలకు నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు భారత్‌ సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం ఇప్పటికే ఈ ప్రక్రియలో నిమగ్నం అయింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాప్తంగా 96 కోట్ల మందికిపైగా అర్హులు ఉన్నట్లు కొన్ని గణాంకాల ప్రకారం తెలిసింది. వారిలో 47 కోట్ల మంది మహిళలేనని సమాచారం.

Advertisement
Advertisement