CREDAI: అందుబాటు గృహాలకు స్థలాలు కేటాయించండి! | Sakshi
Sakshi News home page

CREDAI: అందుబాటు గృహాలకు స్థలాలు కేటాయించండి!

Published Sat, Mar 9 2024 1:56 AM

Allot places for affordable housing says Credai - Sakshi

ప్రభుత్వానికి క్రెడాయ్‌ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: సామాన్య, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేయాలంటే అందుబాటు గృహాలను నిర్మించాలి. చందన్‌వెల్లి, కొత్తూరు వంటి పలు ప్రాంతాలలో తయారీ రంగం అభివృద్ధి చెందింది. ఆయా ప్రాంతాలలో రూ.50 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్‌ హౌసింగ్‌కు డిమాండ్‌ ఉంది. కానీ, స్థలాలు అందుబాటులో లేవు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కలి్పంచడంతో పాటు స్థలాలను అందించాలని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) హైదరాబాద్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఐటీ, ఫార్మా రంగాలతో అభివృద్ధి పశి్చమ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆయా ప్రాంతాలలో లగ్జరీ ప్రా జెక్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యుని సొంతింటి కల మరింత భారంగా మా రిందని, దీనికి పరిష్కారం అందుబాటు గృహాల నిర్మాణమేనని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ వీ రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ స్థలాలను గుర్తించాలని, ప్రభుత్వ, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆయా గృహాలను విక్రయిస్తామని పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను తగ్గించాలి
మహిళా గృహ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 శాతానికి తగ్గించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హాయంలో ఈ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఇన్నర్, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డుల మధ్య రేడియల్‌ రోడ్లు, లింక్‌ రోడ్లను నిర్మించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు మాత్రమే చేస్తున్నామని, అనుమతులు మాత్రం భౌతికంగానే జారీ అవుతున్నాయని తెలిపారు. అనుమతులను కూడా ఆన్‌లైన్‌లో జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Advertisement
Advertisement