అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ : భారీగా డిస్కౌంట్లు

2 Aug, 2021 21:00 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా "గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్" తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 రాత్రి వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్‌ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్ టాప్స్, కెమెరాలు, ఫ్యాషన్, బ్యూటీ ఎసెన్షియల్స్, హోమ్ & కిచెన్, టీవీలు వంటి ఉత్పత్తుల పాటు నిత్యావసర వస్తువుల ధరలపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. ఈ కామర్స్ కంపెనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. 

అలాగే, యూజర్ అమెజాన్ పేతో ద్వారా కొనుగోలు చేస్తే ₹1000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొనుగోలుదారులు ఎంపిక చేయబడ్డ బ్యాంక్ కార్డులపై 3 నెలల అదనపు నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం లభిస్తుంది. షియోమీ, శామ్ సంగ్, ఐక్యూవో, మరిన్ని మొబైల్స్ పై 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ సదుపాయం పొందవచ్చు. స్మార్ట్ ఫోన్లు & యాక్ససరీలపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ 2 5జి, వన్ ప్లస్ నార్డ్ సిఈ 5జి, రెడ్ మి నోట్ 10టి 5జి, రెడ్ మి నోట్ 10లు, మి 11ఎక్స్, శామ్ సంగ్ ఎమ్ 21 2021, శామ్ సంగ్ ఎమ్32, శామ్ సంగ్ ఎమ్ 42 5జి, ఐక్యూవోయూ 7, టెక్నో కామోన్ 17 సిరీస్, టెక్నో స్పార్క్ గో వంటి స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. అమెజాన్ ఇండియా తీసుకొచ్చిన ఈ సేల్‌లో తీసుకొచ్చిన కొన్ని ఒప్పందాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటర్లపై ఆఫర్లు

 • కెమెరాలపై 60% వరకు తగ్గింపు
 • ట్రైపాడ్ లు, రింగ్ లైట్లు వంటి వాటిపై 60% వరకు తగ్గింపు
 • స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలపై 60% వరకు తగ్గింపు
 • హెడ్ ఫోన్ లపై 60% వరకు తగ్గింపు
 • సంగీత వాయిద్యాలు, ప్రొఫెషనల్ ఆడియోపై 60% వరకు తగ్గింపు
 • స్పీకర్లపై 60% వరకు తగ్గింపు
 • ల్యాప్ టాప్ లపై ₹30,000 వరకు తగ్గింపు
 • ప్రింటర్లపై 30% వరకు తగ్గింపు
 • గేమింగ్ యాక్ససరీలపై 50% వరకు తగ్గింపు
 • హై-స్పీడ్ వై-ఫై రూటర్ పై 60% వరకు
 • స్మార్ట్ వాచీలపై 60% వరకు తగ్గింపు
 • హార్డ్ డ్రైవ్లు, బాహ్య ఎస్ఎస్ డీలపై 50% వరకు తగ్గింపు
 • మొబైల్, కెమెరా మెమొరీ కార్డులపై 60% వరకు తగ్గింపు
 • టాబ్లెట్లపై 45% వరకు తగ్గింపు
 • సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లపై 50% వరకు తగ్గింపు
 • ఐటి యాక్ససరీలపై 60% వరకు తగ్గింపు
 • స్టేషనరీ, ఆఫీస్ ఎలక్ట్రానిక్స్ పై 60% వరకు తగ్గింపు
 • మానిటర్లపై 55% వరకు తగ్గింపు
 • పీసీ కాంపోనెంట్లపై 50% వరకు తగ్గింపు
 • డెస్క్ టాప్ లపై ₹40,000 వరకు తగ్గింపు
 • అంతర్గత ఎస్ ఎస్ డిలపై 50% వరకు తగ్గింపు
మరిన్ని వార్తలు