Tesla 3 Car Price In India: American Electric Vehicle Maker Tesla Begins Testing Model 3 In India - Sakshi
Sakshi News home page

Tesla: భారత్‌లో రయ్‌..రయ్‌ : వైరల్‌ వీడియో

Published Tue, Jun 15 2021 12:09 PM

 American Electric Vehicle Maker Tesla Begins Testing Model 3 In India - Sakshi

భారత్‌లో ఇకపై ప్రముఖ ఎలక్ట్రిక్‌ టెస్లా కార్లు రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై సందడి చేయనున్నాయి. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్లా-3 నెంబర్‌ మోడల్‌ కార్లను ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ కార్లతో ప్రపంచ దేశాల్ని ఆకర్షిస్తున్న టెస్లా ఇక భారత్‌ మార్కెట్‌ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో  టెస్లా కార్లు ముంబైకి చెందిన ఓ ప్రాంతంలో టెస్ట్‌ ట్రయల్స్‌ నిర్వహింది. దీనికి సంబంధించిన  వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

విలాసవంతమైన తన కార్లను భారతీయులను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో షోరూంలను, డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బెంగళూరు (కర్ణాటక) కేంద్రంగా టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో రిజిస్టర్‌ చేయించింది.  దీంతో పాటు ముంబై హెడ్‌ ఆఫీస్‌ గా..కొన్ని ప్రధాన నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసి ఈ ఏడాది చివరి నాటికి కార్లను విడుదల చేసేందుకు  సంస్థ ప్రతినిథులు నిర్విరామంగా కృషి చేస్తున్నారట.

బ్లూ డ్యూయెల్‌ మోటార్‌ టెస్లా 3వ నెంబర్‌ మోడల్‌ కారు టైర్లు 18ఇంచెంస్‌, ఏరో బాడీ కిట్‌ మోడల్‌, స్టాండర్డ్ రేంజ్ ప్లస్ వేరియంట్ల కోసం 54 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, లాంగ్ రేంజ్ పెర్ఫార్మెన్స్, 82 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. దాదాపు 381 కిమీ నుండి 614 కిలోమీటర్ల మధ్య లో టెస్లా-3  దూసుకుపోనుంది. ఆకట్టుకునే ఫీచర్లతో చైనాలో తయారై దేశీయ మార్కెట్‌లో అడుగుపెట్టబోతున్న ఈ టెస్లా కారు ధర సుమారు రూ.55లక్షల నుంచి 70లక్షల మధ‍్యలో ఉండనుంది. అయితే టెస్లా 3వ నెంబర్‌ మోడల్ కారు భారత్‌ లో విడుదల అవుతుందా లేదా అనే అంశంపై టెస్లా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతో పాటు ఇది కంప్లీట్లీ బిల్ట్-అప్ (సిబియు) లేదా కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (సికెడి) ను ఎంచుకుంటుందా అనేదానిపై  ఇంకా క్లారిటీ లేదు.

చదవండిTesla S Plaid : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ కార్‌

Advertisement
Advertisement