అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి ఎన్ని కోట్లంటే?

2 Jan, 2024 15:24 IST|Sakshi

ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి పుంజుకుంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా గత ఏడాది నాలుగు కమర్షియల్ యూనిట్లను కొనుగోలు చేసి, ఏడాదికి కోట్ల రూపాయలను అద్దె రూపంలో సంపాదిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డెవెలప్ అవుతున్న నగరాల్లో ఆస్తులను కొనుగోలు చేయడానికి, ఎక్కువ ధరలకు విక్రయిస్తూ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని విక్రయించడానికి కొందరు ఆసక్తి చూపుతున్నారు. మరి కొందరు మాత్రం ఉన్న ఆస్తుల ద్వారా కోట్ల కొద్దీ డబ్బును అద్దె రూపంలో సంపాదించుకుంటున్నారు.

అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు వాణిజ్య యూనిట్లను అద్దెకు ఇస్తున్నారు. ఈ స్పేస్ కోసం మూడు సంవత్సరాల లీజుకు 'వార్నర్ మ్యూజిక్ ఇండియా లిమిటెడ్‌' రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించినట్లు సమాచారం. దీని ద్వారా అమితాబ్ సంవత్సరానికి రూ.2.07 కోట్లు అద్దె సంపాదిస్తున్నారు. నాలుగవ సంవత్సరం నుంచి అద్దె ఏడాదికి రూ.2.38 కోట్లకు చేరనుంది.

ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్

అమితాబ్ బచ్చన్ ఒషివారాలో ఉన్న నాలుగు వాణిజ్య యూనిట్లను 2023 ఆగష్టులో కొనుగోలు చేశారు. ఈ నాలుగు యూనిట్లను ఒక్కొక్కటి రూ.7.18 కోట్లకు కొనుగోలు చేశారు. బచ్చన్ మాత్రమే కాకుండా.. కార్తీక్ ఆర్యన్, మనోజ్ బాజ్‌పేయి, సారా అలీ ఖాన్ కూడా ముంబైలో ఆస్తులు కొనుగోలు చేశారు.

>
మరిన్ని వార్తలు