సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కూల్‌ | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కూల్‌

Published Sat, Oct 15 2022 6:15 AM

Annual rate of inflation based on all India Wholesale Price - Sakshi

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 18 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. 10.7 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్‌లోకి వస్తువుల ధర 10.7 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నప్పటికీ, 18 నెలల నుంచి రెండంకెల పైన కొనసాగుతోంది.

సమీక్షా నెల్లో తయారీ, ఆహారం, ఇంధన ధరలు కొంత దిగివ చ్చాయి. డబ్లు్యపీఐ నెలవారీ తగ్గుదలకు ప్రధానంగా కమోడిటీ ధరలలో నియంత్రణ అని నిపుణులు పేర్కొంటున్నారు. కమోడిటీ ధరలు తగ్గుతాయన్న ధోరణి కూడా వ్యవస్థలో ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు   రికవరీ ఊపందుకోవడం  కూడా సానుకూల అంశమని వారు విశ్లేషిస్తున్నారు.  గణాంకాల్లో కీలక విభాగాలు ఇలా...

► ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 11.03 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 12.37 శాతం. అయితే కూరగాయల ధరలు మాత్రం 39.66 శాతం పెరిగాయి. ఆగస్టులో ఈ స్పీడ్‌ 22.29 శాతం. ఆయిల్‌ సీడ్స్‌ ద్రవ్యోల్బణం 16.55% తగ్గింది.  
► ఇంధనం, విద్యుత్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 32.61 శాతం ఉంటే, ఆగస్టులో ఈ రేటు 33.67 శాతంగా ఉంది.  
► ఇక సూచీలో మెజారిటీ వెయిటేజ్‌ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.34 శాతంగా ఉంది. 

Advertisement
Advertisement