గూగుల్‌పై మిట్టల్ ఆగ్రహం.. యాప్స్‌ అన్నీ రీస్టోర్‌ చేయాల్సిందే! | Sakshi
Sakshi News home page

గూగుల్‌పై మిట్టల్ ఆగ్రహం.. యాప్స్‌ అన్నీ రీస్టోర్‌ చేయాల్సిందే!

Published Sat, Mar 2 2024 2:20 PM

Anupam Mittal Criticizes Google For Delisting Indian Apps - Sakshi

సర్వీసు ఫీజు చెల్లింపులపై వివాదం తలెత్తిన నేపథ్యంలో భారత్‌లోని తన ప్లే స్టోర్‌ నుంచి కొన్ని యాప్‌లను గూగుల్ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే షార్క్ ట్యాంక్ జడ్జ్‌, పీపుల్ గ్రూప్  షాదీ.కామ్ వ్యవస్థాపకుడు,సీఈఓ అనుపమ్ మిట్టల్ గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇండియా ఇంటర్నెట్‌కు ఈరోజు చీకటి రోజు.సర్వీసు ఫీజు చెల్లింపు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ గూగుల్‌ యాప్స్‌ను తొలగించింది. సేవ్‌ స్టార్టప్‌ అంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఎక్స్‌.కామ్‌లో ట్యాగ్‌ చేశారు. 

గూగుల్‌ యాప్స్‌ తొలగింపు అంశంలో సీసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్లేస్టోర్‌లో డీలిస్ట్‌ చేసిన యాప్స్‌ని రీస్టోర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement