రీడిజైన్డ్‌ యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ వచ్చేసింది: ప్రత్యేకతలేంటి?

7 Jun, 2022 15:17 IST|Sakshi

న్యూఢిల్లీ: యాపిల్‌ రీడిజైన్ చేసిన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఎం1 చిప్‌ను  అప్‌గ్రేడ్‌ చేసి ఎం 2 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తాజాగా ఆవిష్కరించింది. యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2022లో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌  లాంచ్‌ చేశారు. కోవిడ్‌ తరువాత ఆఫ్‌లైన్లో  నిర్వహిస్తున్న తొలి డెవలపర్‌ల సమావేశంలో ఐవోస్‌ 16కి  సంబంధించి కొత్త అపడేట్‌ సహా కొన్ని భారీ ప్రకటనలను కూడా చేసింది.


ఇండియన్‌ మార్కెట్లో ధరలు
10 జీపీయూ కోర్  ఎం2 మ్యాక్‌బుక్ ఎయిర్  ధర  రూ. 1,49,000 నుండి ప్రారంభం
8 జీపీయూ కోర్  ఎం2 మ్యాక్‌బుక్ ఎయిర్  ధర రూ. 1,19,900 నుండి 

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ల్యాప్‌టాప్‌ ఫీచర్లు 
13.6 అంగుళాల డిస్‌ప్లే (థిన్నర్‌ బెజెల్స్‌)
2560x1664  నేటివ్‌ పిక్సెల్స్‌​ రిజల్యూషన్‌
బేస్ వేరియంట్‌తో 8జీబీ ర్యామ్‌,  256 జీబీ స్టోరేజ్‌
స్టోరేజీని 2టీవీ వరకు విస్తరించుకునే అవకాశం 
11.3 మిమీ, బరువు 2.7 పౌండ్లు (1.22 కిలోలు)
 సిల్వర్‌,  స్పేస్ గ్రే, స్టార్‌లైట్, మిడ్‌నైట్ బ్లాక్ . గోల్డ్ కలర్‌లలో  లభ్యం.

ఇందులోని ఎం2  చిప్  గత జనరేషన్‌ ఇంటెల్ ఆధారిత మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 5 రెట్లు వేగం, అలాగే 2020 ఎంఐ మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 40 శాతం వేగంగా పనిచేస్తుంది. ఇది డ్యూయల్ USC-C పోర్ట్‌లతో కూడా వస్తుంది, రెండూ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. 20 గంటల బ్యాటరీ లైఫ్‌, 1080p  హెచ్‌డీ కెమెరా, MagSafe ఛార్జింగ్‌, టచ్ ఐడీ, మేజిక్‌ కీబోర్డ్ ,  ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్ లాంటివి ఇతర ఫీచర్లు

మరిన్ని వార్తలు