ఐఫోన్‌కు షాక్‌, సేల్స్ పెరిగిన భార‌త్‌లో తొలిస్థానం ఆ ఫోన్‌దే!!

4 Feb, 2022 14:10 IST|Sakshi

భార‌త్‌లో యాపిల్ ఐఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎన్న‌డూ లేని విధంగా గ‌తేడాది క్యూ4 ఫ‌లితాల్లో ఒక్క ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ 34 శాతం సేల్స్ న‌మోద‌య్యాయి. అయితే ఊహించ‌ని విధంగా ఐఫోన్ సేల్స్ జ‌రిగిన‌ప్ప‌ట‌కీ.. దేశీయ మార్కెట్‌లో తొలి ఐదుస్థానాల్లో ఉన్న మిగిలిన స్మార్ట్ ఫోన్ల‌కు స‌రైన పోటీ ఇవ్వ‌క‌పోవ‌డం ఆస‌క్తి క‌రంగా మారింది

కౌంట‌ర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్ర‌కారం..క్యూ4 ఫ‌లితాల్లో భార‌త్‌లో ఐఫోన్ సేల్స్ షావోమీ, శాంసంగ్‌, రియ‌ల్‌మీ, వివో, ఒప్పోల స్థానాల్ని అధిగ‌మించ‌లేక‌పోయింది. అందుకు కార‌ణం ఐఫోన్ ఖ‌రీదు ఎక్కువ‌గా ఉండ‌డ‌ట‌మేన‌ని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇత‌ర ఫోన్ తయారీదారులతో పోలిస్తే మార్కెట్ వాటా పరంగా ఐఫోన్ వెనుకబడి ఉండగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, వాటిలో కొన్ని స్మార్ట్ ఫోన్‌ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు కొన్ని గ‌ణాంకాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

భార‌త్ లో ఐఫోన్ ధ‌రలు ఎక్కువ‌గా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ  2021,4వ త్రైమాసికంలో యాపిల్ సుమారు 2.3 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. శాంసంగ్ 7.2 మిలియన్ ఫోన్‌లను,షావోమీ మొత్తం 9.3 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్‌తో ఆగ్ర‌స్థానంలో కొన‌సాగుతుంది. ఇతర ప్రధాన బ్రాండ్‌లతో పోల్చితే తక్కువ అమ్మ‌కాలు జ‌రిపిన‌ప్ప‌టికీ దేశీయంగా క్యూ4 2021లో 2.09 బిలియన్ల ఆదాయాన్ని గ‌డించి ఉండొచ్చ‌ని, శాంసంగ్ దాదాపు 2 బిలియన్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పండుగ సీజన్‌లో కస్టమర్‌లు  ఐఫోన్ 12, ఐఫోన్ 13 సేల్స్ దూకుడు పెంచాయి. గ‌తేడాది డిసెంబ‌ర్ నెల‌లో ఐఫోన్ 12ను రూ.50వేల‌కు అమ్మ‌డంతో పాటు ఐఫోన్ 13పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్ర‌క‌టించ‌డంతో కొనుగోలుదారులు ఐఫోన్‌ల‌ను సొంతం చేసేందుకు ఇంట‌స్ట్ర్ చూపించారు. 

ఈ సంద‌ర్భంగా.. గత త్రైమాసికంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ సేల్స్‌పై  కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ హెడ్ నీల్ షా మాట్లాడుతూ..ఈ సేల్స్ తో భార‌త్ లో ఐఫోన్ మ‌రో మ‌లుపు తిరిగింది. కోవిడ్‌లోనూ  భారతీయులు ప్రీమియం ఫోన్‌లపై డ‌బ్బులు ఖ‌ర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టెక్నాల‌జీతో ముడిప‌డి ఉన్న ఫోన్‌ల‌ను సొంతం చేసేందుకు కొనుగోలు దారులు సిద్ధంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు