Sakshi News home page

మెటా నుంచి యాపిల్‌ వరకు..ఉద్యోగుల తొలగింపులో టెక్‌ కంపెనీల దూకుడు!

Published Wed, Apr 5 2023 10:33 PM

Apple Job Cuts In Some Corporate Retail Teams - Sakshi

కొత్త సంవత్సరంలో టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత వేగం పుంజుకొన్నది. ఆర్థిక మాంద్యం భయాందోళనలతో కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ లేఆఫ్‌ దారిలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి బడా సంస్థలు కూడా చేరాయి.

తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్‌ కార్పొరేట్‌ రీటైల్‌ విభాగానికి చెందిన ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వడ్డీరేట్లు పెంపు, ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాల కారణంగా ఉద్యోగుల తొలగింపులు నిర్ణయం అనివార్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసిందనే విషయంపై స్పష్టత లేదు. 

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు టెక్‌ సంస్థలు ఎంతమందిని తొలగించాయో ఒక్కసారి పరిశీలిస్తే..మెటా మరోసారి వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. గతవారం నుంచి కొంత నెమ్మదించినట్టు కనిపించిన ఈ తొలగింపుల ప్రక్రియ, మళ్లీ ప్రారంభం కానుంది. గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని ఇంటికి సాగనంపిన మెటా, ఈసారి కూడా వేలమందిని తీసేయనున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.

గూగుల్ ఈ ఏడాది ప్రారంభంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు దఫాలుగా ఉద్యోగాల కోతలతో అమెజాన్‌ ఇప్పటివరకు 27,000 మందిని ఇంటికి సాగనంపింది. మొదటి రౌండ్‌లో 18,000 మందిని, రెండవ రౌండ్‌లో 9000వేల మందికి పింక్‌ స‍్లిప్‌లు జారీ చేసిన విషయం తెలిసిందే.   

Advertisement

తప్పక చదవండి

Advertisement