ఏప్రిలియా బుకింగ్స్‌ షురూ...!

3 Apr, 2021 08:53 IST|Sakshi

ముంబై: ప్రముఖ ఆటో మొబైల్‌ దిగ్గజం పియాజియో ఇండియా ఇటీవల ఆవిష్కరించిన ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 125 ప్రీ – బుకింగ్స్‌ శుక్రవారం ప్రారంభమయ్యాయి. పియాజియో డీలర్ల వద్ద, ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.5,000 చెల్లించి ఈ మోడల్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సరికొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ 125 గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసిన ఎస్‌ఎక్స్‌ఆర్‌160 మోడల్‌కు అప్‌డేట్‌ వెర్షెన్‌గా వస్తుంది. ఇందులో బీఎస్‌–6 ప్రమాణాలు కలిగిన 125సీసీ త్రీ వాల్వ్‌ ఫ్యూయల్‌ ఎజెక్టెడ్‌ ఇంజిన్‌ను అమర్చారు.

అలాగే ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఎల్‌ఈడీ టైల్‌ లైట్స్, ఫ్యూయల్‌ డిజిటల్‌ క్లస్టర్, బ్లూటూత్‌ మొబైల్‌ కనెక్టివిటీ సదుపాయం, అనువైన సీటింగ్‌ వ్యవస్థ, అడ్జెస్టబుల్‌ రేర్‌ సస్పెన్షన్, సీబీఎస్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌తో డిస్క్‌ బ్రేక్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

చదవండి: డబ్ల్యూఎల్‌పీకి రెండో హబ్‌గా హైదరాబాద్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు