Sakshi News home page

ఆడి కార్ల అమ్మకాలు అదుర్స్‌

Published Thu, Oct 5 2023 8:47 AM

Audi India registers growth of 88 pc in the first nine months of 2023 - Sakshi

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి గడిచిన తొమ్మిది నెలల్లో రికార్డు స్థాయిలో కార్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఈ జనవరి –సెప్టెంబర్‌ మధ్య 88% వృద్ధితో మొత్తం 5,530 కార్లను అమ్మినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 2,947 కార్లను డెలివరీ చేసింది. క్యూ8 ఈ–ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్‌ ఈ–ట్రాన్, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌లతో పాటు ఏ4, ఏ6, క్యూ5 మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించినట్లు తెలిపింది.

‘‘ఎస్‌యూవీల విభాగపు అమ్మకాల వృద్ధి 187% నమోదైంది. రానున్న పండుగ సీజన్‌ కారణంగా నెలకొనే డిమాండ్‌తో ఈ ఏడాది మొత్తం విక్రయాల వృద్ధిని కొనసాగిస్తాము’’ అని ఆడి ఇండియా అధినేత బల్బీర్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. బలమైన డిమాండ్, లగ్జరీ కార్ల మార్కెట్‌ విస్తరణతో పాటు మెరుగైన ఆర్థిక స్థితిగతులు కార్ల అమ్మకాల పెరుగుదలకు కారణమయ్యాయని బల్బీర్‌ సింగ్‌ వివరించారు.

Advertisement
Advertisement