2030 నాటికి టార్గెట్ ఇదే! - పియూష్ గోయల్ | Sakshi
Sakshi News home page

2030 నాటికి ఆ కంపెనీల టార్గెట్ ఇదే! - పియూష్ గోయల్

Published Sun, Jan 7 2024 3:29 PM

Auto Industry New Target To Export Piyush Goyal - Sakshi

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన దేశం నుంచి ఎగుమతయ్యే వాహనాల శాతాన్ని పెంచాలని వాణిజ్య & పరిశ్రమల మంత్రి 'పియూష్ గోయల్' అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆటోమొబైల్ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసిన వాహనాలు 14 శాతమని తెలుస్తోంది. ఇది 2030 నాటికి 50 శాతానికి చేరుకోవాలని మెగా మొబిలిటీ షో 'భారత్ మొబిలిటీ' కోసం లోగో అండ్ బుక్‌లెట్‌ను ఆవిష్కరించే కార్యక్రమంలో గోయల్ అన్నారు.

2024 ఆటో ఎక్స్‌పో
2024 గ్లోబల్ ఎక్స్‌పో వచ్చే నెల ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల్లోని చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇందులో భవిష్యత్తులో రానున్న వాహనాలు, ఆటోమోటివ్ భాగాలలో అత్యాధునిక సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీలు, అర్బన్ మొబిలిటీ సొల్యూషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అటానమస్ వంటి వినూత్నమైన సాంకేతికతలు దర్శనమివ్వబోతున్నాయి.

సుమారు 50కి పైగా దేశాల నుంచి 600 మందికి పైగా ఎగ్జిబిటర్‌లతో, ఎక్స్‌పో అత్యాధునిక సాంకేతికతలతో కనిపించనుంది. 27కంటే కంపెనీలు కొత్త మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో హైబ్రిడ్, CNG వాహనాలను ప్రదర్శిస్తారని ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి: బంగారం, వెండి కొనటానికి కరెక్ట్ టైమ్ వచ్చింది! ఎందుకంటే?

2024 ఎక్స్‌పోలో జపాన్, జర్మనీ, కొరియా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి దేశాల పెవిలియన్‌లను ఉంటాయి. అయితే యుఎస్, స్పెయిన్, యుఎఇ, రష్యా, ఇటలీ, టర్కీ, సింగపూర్, బెల్జియం నుంచి అంతర్జాతీయ భాగస్వామ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎక్స్‌పోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement