Trolls On Hrithik Roshan And Katrina Zomato Ads, Statement Goes Viral - Sakshi
Sakshi News home page

Zomato: యాడ్‌ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు

Published Tue, Aug 31 2021 1:06 PM

Backlash Against Ads Featuring Hrithik Roshan Katrina Zomato Responds - Sakshi

సాక్షి, ముంబై: ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ప్రమోషన్‌లో భాగంగా  బాలీవుడ్‌ నటుడు హృతిక్‌  రోషన్, కత్రినా కైఫ్ నటించిన  రెండు ప్రకటనలను ఆగస్టు 26న విడుదల  చేసింది. దీంతో ఈ యాడ్స్‌పై సోషల్‌ మీడియాలో దుమారం రేగింది. జొమాటో డెలివరీ కార్మికుల పట్ల ఇంత అన్యాయమా అంటూ నెటిజన్లు జొమాటోపై విరుచుకుపడ్డారు. దీంతో జొమాటో స్పందించింది. ది అదర్‌ సైడ్‌ ఆఫ్‌ ది స్టోరీ అంటూ ట్విటర్‌లో ఒకపోస్ట్‌ పెట్టింది. 

తమ తాజా ప్రకటనలను దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకున్నారం టూ జొమాటో ఒక ప్రకటన విడులల చేసింది. తమ ఉద్యోగులను హీరోలుగా నిలబెట్టడంతోపాటు, డెలివరీ భాగస్వాములతో గౌరవంగా మాట్లాడటం, డెలివరీ ఉద్యోగి గౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రతి కస్టర్‌ తమకొక స్టార్ అని పునరుద్ఘాటించడమే ముఖ్య ఉద్దేశమని అని కంపెనీ తెలిపింది. 

బాలీవుడ్‌ స్టార్లు హృతికి రోషన్‌, కత్రినా కైఫ్‌తో యాడ్స్‌
వివాదానికి సంబంధించిన ప్రకటనలను పరిశీలిస్తే..హృతిక్ రోషన్ నటించిన జోమాటో యాడ్‌లో ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు జొమాటోబాయ్‌ కస్టమర్‌( హృతిక్‌) డోర్‌బెల్ బెల్‌ మోగిస్తాడు. హృతిక్ రోషన్‌ను చేసిన అతను ఆశ్చర్యపోతాడు. ఇంతలో బాలీవుడ్ స్టార్ అతడిని సెల్ఫీ కోసం వేచి ఉండమంటాడు. దీనికి డెలివరీ బాయ్‌ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. కానీ ఇంతలోనే ఫోన్ రింగ్ అవుతుంది.  తరువాతి డెలివరీ చేయాల్సిన మరో ఆర్డర్‌కు సంబంధించి కాల్‌ అది. దీంతో రోషన్‌తో సెల్ఫీ  ఛాన్స్‌ వదులుకొని, మరో ఆర్డర్‌ డెలివరీకి బయలుదేరతాడు సంతోషంగా. "హృతిక్ రోషన్ హో, యా ఆప్, అప్నేలియే హర్ కస్టమర్ హై స్టార్ (హృతిక్ రోషన్ అయినా,మీరైనా, ప్రతీ కస్టమర్ జోమాటోకి స్టార్) అంటూ యాడ్‌ ముగుస్తుంది.(Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి)

కత్రినా కైఫ్ నటించిన యాడ్‌లో కూడా ఇలాంటి సందేశమే ఉం​టుంది. బర్త్‌డే కేక్‌ డెలివరీ ఇచ్చిన బాయ్‌ని కేక్ తిందువు ఉండమని అభ్యర్థిస్తుంది కత్రినా. ఇంతలో మరొక ఫుడ్ ఆర్డర్ కోసం నోటిఫికేషన్‌ వస్తుంది. ఇక్కడే జొమాటోకు ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల పట్ల ఇంత అన్యాయమా, ఇలాంటి ఆనందాలనువారికి దూరం చేస్తారా అంటూ నెటిజన్లు మండి పడ్డారు. డెలివరీ బాయ్‌లకు నిమిషం వ్యవధి కూడా ఇవ్వరా అంటూమరికొంతమంది విమర్శించారు. అంతేకాదు వారికి సరియైన వేతనాలు చెల్లించడం కంటే కంపెనీ సెలబ్రిటీలతో ప్రకటనల కోసం డబ్బు ఖర్చు చేస్తుందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జొమాటో స్పందించింది. చాలామంది తమ ప్రకటన పట్ల సానుకూలంగా స్పందించారని, అయితే కొంతమందికి మాత్రమే నచ్చలేదని తెలిపింది. ఇవి ఆరు నెలల క్రితం తయారు చేసినవని వివరించింది. అలాగే తమ డెలివరీ పార్టనర్ల చెల్లింపులపై త్వరలోనే ఒక బ్లాగ్ పోస్ట్‌ను ప్రచురిస్తామని తెలిపింది. తమ డెలివరీ పార్టనర్ నెట్ ప్రమోటర్ స్కోర్  10నుంచి 28 శాతానికి పెరిగిందని ఇది ఇంకా  పెరుగుతూనే ఉందని జొమాటో పేర్కొంది.  (taliban: మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు)
 

Advertisement
Advertisement