పెరిగిన గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌.. హైదరాబాద్‌లో 108.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ | Sakshi
Sakshi News home page

పెరిగిన గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌.. హైదరాబాద్‌లో 108.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ

Published Fri, Jun 23 2023 3:51 AM

Bengaluru Has 28percent Prime Office Space Among Top 6 Cities - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో గ్రేడ్‌ ఏ ప్రీమియం కార్యాలయ స్థలాల (ఆఫీస్‌ స్పేస్‌) లభ్యత మార్చి చివరికి 700 మిలియన్‌ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ) దాటింది. ఇందులో బెంగళూరు వాటా 28 శాతంగా ఉంది. ఈ వివరాలతో రియల్టర్ల సంఘం క్రెడాయ్, డేటా అనలైటిక్‌ సంస్థ సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ సంయుక్తంగా ఓ నివేదిక విడుదల చేశాయి. 2022 డిసెంబర్‌ నాటికి గ్రేడ్‌ ఏ ఆఫీసు స్థలాల నిల్వలు (లీజుకు అందుబాటులో ఉన్న) 692.91 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. (వైట్‌హౌస్‌ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్‌ మహీంద్ర)

ఇక 2021 డిసెంబర్‌ నాటికి ఇది 643.84 ఎస్‌ఎఫ్‌టీ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరులో 195.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 139.6 మిలియన్‌ చ.అడుగులు, ముంబై మెట్రో పాలిటన్‌ రీజియన్‌ లో 118.1 మిలియన్‌ చదరపు అడుగులు, హైదరాబాద్‌లో 108.2 మిలియన్‌ చదరపు అడుగులు, పుణెలో 72.4,  చెన్నైలో 67.5 ఎస్‌ఎఫ్‌టీ చొప్పున గ్రేడ్‌ ఏ ప్రీమియం ఆఫీసు స్థలాల నిల్వలున్నాయి. స్థిరమైన డిమాండ్‌ మద్దతుతో 2030 నాటికి గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌ లభ్యత బిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.  (రూ. 10వేల కోట్ల సుందర్‌ పిచాయ్‌ లగ్జరీ భవనం (ఫోటోలు))

కోవర్కింగ్‌ స్పేస్‌ 7 శాతం
కోవర్కింగ్‌ స్పేస్‌ గత ఐదేళ్లలో అపార వృద్ధిని చూసిందని, ఇది 50 మిలియన్‌ చదరపు అడుగులు దాటినట్టు ఈ నివేదిక తెలిపింది. ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీసు స్థలాల్లో 7 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది. ‘‘దేశ వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తుండడం అభినందనీయం. ఈ పెరుగుదలకు అనేక కారణాలను చెప్పొచ్చు. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉండడం, నూతన తరం పరిశ్రమల వృద్ధి, బహుళజాతి సంస్థల రాక పెరగడాన్ని చెప్పుకోవచ్చు.

వినూత్నమైన కార్యాలయ డిజైన్లు, ప్రంపచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీ అనుసంధానత అన్నీ కలసి మన వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్‌ను ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి’’ క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బోమన్‌ ఇరానీ తెలిపారు. ‘‘700 మిలియన్‌ ఎప్‌ఎఫ్‌టీ అంటే గణనీయమైనది. ఇందులో 25 శాతం గత ఐదేళ్ల కాలంలో అందుబాటులోకి వచి్చందే. డెవలపర్లు భవన నిర్మాణాల్లో ఎంతో వినూత్నతతో, ఈఎస్‌జీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు’’అని సీఆర్‌ఈ మ్యాట్రిక్స్, ఇండెక్స్‌ ట్యాప్‌ సీఈవో అభిõÙక్‌ కిరణ్‌ గుప్తా తెలిపారు.

Advertisement
Advertisement