ట్విటర్‌ను హ్యాండిల్‌ చేయడం టెస్లా అంత ఈజీ కాదు - బిల్‌గేట్స్‌

6 May, 2022 15:04 IST|Sakshi

నాటకీయ పరిణామాల మధ్య ట్విటర్‌ను సొంతం చేసుకుని అందరి చేత ఔరా అనిపించాడు ఈలాన్‌ మస్క్‌, ఈ నిర్ణయాన్ని ముందుగా వ్యతిరేకించిన ఎందరో తర్వాత ఈలాన్‌కు మద్దతుదారులగా మారారు. అయితే మైక్రోసాఫ్ట్‌ అధినేత బిలేగేట్స్‌ మాత్రం ఈ టేకోవర్‌పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో​ జరిగిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈవెంట్‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూజర్లకు ఫ్రీ స్పీచ్‌ అందివ్వాలనే ఉద్దేశంతో ట్విటర్‌ను ఈలాన్‌ మస్క్‌ టేకోవర్‌ చేసినట్టు చెబుతున్నారు. కానీ ఫ్రీ స్పీచ్‌ ముసుగులో వచ్చే ద్వేషపూరిత వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాన్ని ఎలా అరికడతారంటూ ప్రశ్నించారు. ఫ్రీ స్పీచ్‌కి అవకాశం ఇస్తూనే దీన్ని ఆపే విధానం ఎలా ఉంటుందో చూడాలన్నారు బిల్‌గేట్స్‌.

ఈలాన్‌ మస్క్‌ దగ్గర మంచి ఇంజనీర్లు, టెక్నిషియన్లు ఉండవచ్చు. కానీ టెస్లా, స్పేస్‌ఎక్స్‌లను నిర్వహించినంత సుళువు కాదు ట్విటర్‌ను హ్యాండిల్‌ చేయడం అంటూ తన అభిప్రాయం చెప్పారు బిల్‌గేట్స్‌. ఇప్పటికయితే ట్విటర్‌ గాడి తప్పుతుందని నేను అనేకోవడం లేదని, అయితే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కచ్చితంగా తన అభిప్రాయాలు చెబుతానని ఆయన వెల్లడించారు. 
 

చదవండి: మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు: సౌదీ యువరాజు ట్యూన్‌ ఇలా మారిందేంట‌బ్బా!

మరిన్ని వార్తలు