Bombay High Court orders Rapido to suspend all services in Maharashtra - Sakshi
Sakshi News home page

ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు!

Published Mon, Jan 16 2023 12:00 PM

Bombay High Court To Suspend Rapido All Services In Maharashtra Till January 20 - Sakshi

ర్యాపిడోకి బాంబే హైకోర్ట్ గట్టి షాక్ ఇచ్చింది. పుణెలో ర్యాపిడో సర్వీస్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడో ట్యాక్సీ సర్వీస్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. బైకలతో పాటు కంపెనీకి చెందిన వాహనాలకు లైసెన్స్‌ లేదని తేల్చి చెప్పింది.

అసలేం జరిగింది
గతేడాది డిసెంబర్‌లో ర్యాపిడో లైసెన్స్‌ దరఖాస్తుని రవాణా శాఖ తిరస్కరించింది. కంపెనీ అప్లికేషన్‌లో బైక్, ట్యాక్సీలపై మార్గదర్శకాలు స్పష్టంగా లేవని, కనుకు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ అంశంపై ర్యాపిడో కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుకు సంబంధించి ర్యాపిడో తరపు న్యాయవాదులు వాదిస్తూ.. లైసెన్స్ కోసం కంపెనీ దరఖాస్తు చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వాదించారు.

అయితే లైసెన్స్ ప్రక్రియ ఇంకా దరఖాస్తు దశలోనే ఉందని, ప్రస్తుతం ర్యాపిడో కార్యకలపాలు జరపడం చట్టవిరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే శుక్రవారం వరకు ర్యాపిడో తమ అ‍న్నీ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే శుక్రవారం (జనవరి 20న) కోర్టు మరో సారి దీనిపై విచారణ చేపట్టనుంది.

చదవండి: ‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్‌ టాటా భావోద్వేగ పోస్ట్‌ వైరల్‌!

Advertisement

తప్పక చదవండి

Advertisement