మీడియా మింట్‌ కొనుగోలు ఒప్పందం రద్దు: బ్రైట్‌కామ్‌

14 Sep, 2022 09:25 IST|Sakshi

న్యూఢిల్లీ: మీడియామింట్‌ సంస్థ కొనుగోలు కోసం కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు డిజిటల్‌ మార్కెటింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ బ్రైట్‌కామ్‌ వెల్లడించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.

‘కొనుగోలు లావాదేవీ కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య డీల్‌గా మార్చుకోవాలని, బ్రైట్‌కామ్‌ భవిష్యత్తులో చేపట్టే కొనుగోళ్లకు బ్యాక్‌ఎండ్‌ సేవలు అందించాలని ఇరు సంస్థలూ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో 2021 డిసెంబర్‌ 7న కుదుర్చుకున్న షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి‘ అని స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. 

మీడియామింట్‌ ఇటీవల దక్కించుకున్న కొంత మంది క్లయింట్ల కార్యకలాపాలు .. బ్రైట్‌కామ్‌ ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం కోవకే చెందినవని, దీని వల్ల విలీన సంస్థ వృద్ధి అవకాశాలపై ప్రభావం పడవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.    

మరిన్ని వార్తలు