ఆహా ఏమి అదృష్టం! లక్షకు ఏడాదిలో రూ.35 లక్షలు | Sakshi
Sakshi News home page

ఆహా ఏమి అదృష్టం! లక్షకు ఏడాదిలో రూ.35 లక్షలు

Published Fri, Nov 26 2021 5:26 PM

Brightcom Group Penny Stock Turned into a Multibagger in 1 Year - Sakshi

గత ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లలో దిగ్గజ కంపెనీల జోరు తగ్గిన చిన్న చిన్న కంపెనీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ చిన్న కంపెనీలే మదుపరుల ఇంట కనకం వర్షం కురిపిస్తున్నాయి. గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతున్న వీటి షేర్ల ధరలు మాత్రం పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు మనం అలాంటి ఓక స్టాక్ మార్కెట్ గురుంచి తెలుసుకుందాం. బ్రైట్ కామ్ గ్రూప్ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక సంవత్సరంలో 3500 శాతం రిటర్న్స్ అందించింది. నవంబర్ 27, 2020న రూ3.92 వద్ద ఉన్న షేర్ ధర నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బిఎస్ఈ)లో రూ.137.50 వద్ద ఉంది.

అంటే, ఏడాది క్రితం బ్రైట్ కామ్ గ్రూప్ షేర్లలో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయలు ఈ రోజు రూ.35 లక్షలుగా మారాయి. అయితే, ఇదే కాలంలో సెన్సెక్స్ 47.89 శాతం పెరిగింది. బ్రైట్ కామ్ గ్రూప్ అనేది 2000లో స్థాపించిన ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ కంపెనీ భారతదేశం, యుఎస్, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, ఉరుగ్వే, మెక్సికో, యుకె, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, ఉక్రెయిన్, సెర్బియా, ఇజ్రాయిల్, చైనా, భారతదేశం మరియు ఆస్ట్రేలియా, మరియు పోలాండ్, ఇటలీలో ప్రతినిధులు/ భాగస్వాములని కలిగి ఉంది. ఇది 2020లో ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో 400వ స్థానంలో ఉంది. ఇది అనేక కంపెనీలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టె ముందు ఆ కంపెనీ చరిత్ర తెలుసుకొని చిన్న, చిన్న మొత్తాలతో ప్రయాణం ప్రారంభించాలి. 

(చదవండి: చిప్‌ ఎఫెక్ట్‌.. శాంసంగ్‌ ‘బాహుబలి’ ప్రాజెక్ట్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement