Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు.. రికార్డుల హోరు | Sakshi
Sakshi News home page

Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు

Published Thu, Sep 23 2021 4:04 PM

Closing Bell: Nifty ends above 17,800, Sensex jumps 958 pts - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు స్థాయిలో ముగిశాయి. స్టాక్‌ మార్కెట్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. రుతు పవనాల పురోగతి, వ్యాక్సినేషన్ల వేగం వంటి సానుకూల పరిణామాల నేపథ్యంలో సూచీలు దూసుకెళ్లినట్లు ఎల్‌కెపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ పేర్కొన్నారు. అలాగే, సానుకూల ప్రపంచ సూచనల మధ్య సూచీలు రికార్డు స్థాయిలలో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 958.03 పాయింట్లు (1.63%) పెరిగి 59,885.36 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 276.30 పాయింట్లు (1.57%) పెరిగి 17,823 వద్ద ముగిసింది. నేడు సుమారు 1866 షేర్లు అడ్వాన్స్ అయితే, 1305 షేర్లు క్షీణించాయి, 148 షేర్లు మారలేదు. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 73.72గా నమోదైంది. బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టౌబ్రో, కోల్ ఇండియా నిఫ్టీలో భారీ లాభాలను పొందగా.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ భారీగా నష్ట పోయాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో రియాల్టీ ఇండెక్స్ దాదాపు 9 శాతం లాభపడగా, ఐటీ, మెటల్, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.(చదవండి: పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్!)

Advertisement

తప్పక చదవండి

Advertisement