Sakshi News home page

ఏం టెక్నాలజీ గురూ.. సంచిలో పడేస్తే చల్లగా ఉంటాయట

Published Sun, Sep 10 2023 12:20 PM

Cooler Backpack Design Bag Review - Sakshi

కూల్‌డ్రింక్స్, వైన్, బీరు వంటివి చల్లగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఆరుబయట పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు ఇవన్నీ చల్లగా దొరకాలంటే కుదిరే పని కాదు. వాటి కోసం పోర్టబుల్‌ రిఫ్రిజిరేటర్లను లేదా ఐస్‌మేకర్లను తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు ఈ సంచి వెంట ఉంటే చాలు.

పోర్టబుల్‌ రిఫ్రిజిరేటర్లను, ఐస్‌మేకర్లను మోసుకుపోనవసరం ఉండదు. ముందుగానే ఇంట్లోని ఫ్రిజ్‌లో చల్లబరచిన పానీయాల సీసాలు,క్యాన్‌లను ఇందులో పడేసుకుని తీసుకుపోతే చాలు. ఇందులో భద్రపరచిన సీసాలు, క్యాన్‌లు ఇరవైనాలుగు గంటలసేపు ఏమాత్రం చల్లదనం కోల్పోకుండా, అప్పుడే ఫ్రిజ్‌లోంచి బయటకు తీసినట్లుగా ఉంటాయి. 

కట్టుదిట్టమైన ఇన్సులేషన్‌తో రూపొందించిన ఈ బ్యాగ్‌ లోపల ఎంత చల్లని వస్తువులను ఉంచినా, బయటకు ఏమాత్రం నీరు చిమ్మదు. కెనడియన్‌ స్టార్టప్‌ కంపెనీ ‘కూలీ’ పేరుతో ఈ బ్యాక్‌ప్యాక్‌ కూలర్‌ బ్యాగును ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆరు రంగుల్లో దొరికే ఈ బ్యాగు ధర 50 డాలర్లు (రూ.4,131) మాత్రమే! 

Advertisement

What’s your opinion

Advertisement