క్యూబ్‌ హైవేస్‌ నిధుల సమీకరణ | Sakshi
Sakshi News home page

క్యూబ్‌ హైవేస్‌ నిధుల సమీకరణ

Published Thu, Apr 20 2023 6:25 AM

Cube Highways Fundraiser - Sakshi

న్యూఢిల్లీ: బ్రిటిష్‌ కొలంబియా ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్, అబుధాబి సావరిన్‌ సంస్థ ముబడాల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ తదితరాల నుంచి  క్యూబ్‌ హైవేస్‌ ట్రస్ట్‌ 63 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 5,226 కోట్లు) సమీకరించింది. ఇన్విట్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ అయిన క్యూబ్‌ హైవేస్‌ ఫండ్‌ అడ్వయిజర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నిధుల సమీకరణ అంశాన్ని వెల్లడించింది. ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ కింద జారీ చేసిన ఇన్విట్‌ సాధారణ యూనిట్లను లిస్టింగ్‌ చేసినట్లు పేర్కొంది. దేశీయంగా లిస్టయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఇన్విట్‌).. క్యూబ్‌ హైవేస్‌ ట్రస్ట్‌లో కెనడియన్‌ పెన్షన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ బీసీఐ, ముబడాలతోపాటు మరికొన్ని దేశీ సంస్థలు కొత్త యాంకర్‌ ఇన్వెస్టర్లుగా నమోదైనట్లు తెలియజేసింది.  

18 ఆస్తులు
క్యూబ్‌ హైవేస్‌ ఇన్విట్‌ దాదాపు 1,424 కిలోమీటర్ల పొడవైన 18 టోల్, యాన్యుటీ రోడ్‌ ఆస్తులను కలిగి ఉంది. వీటిలో 17 ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ రోడ్‌ ఆస్తులుకాగా.. ఒకటి ఎన్‌హెచ్‌ఏఐ యాన్యుటీ రోడ్‌ ప్రాజెక్టుగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, హర్యానా తదితర 11 రాష్టాలలో రోడ్‌ ప్రాజెక్టులు విస్తరించినట్లు తెలియజేసింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ నుంచి రూ. 10,000 కోట్ల రుణ సౌకర్యాలను పొందేందుకు సంతకాలు జరిగినట్లు క్యూబ్‌ హైవేస్‌ ఇన్విట్‌ పేర్కొంది. ప్రస్తుత రుణాల రీఫైనాన్సింగ్‌కు నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement