24న స్టార్టప్‌ల ‘డీ2సీ అన్‌లాక్డ్‌’ సమావేశం

23 Jun, 2023 04:38 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మర్చంట్‌ ఫస్ట్‌ చెకవుట్‌ నెట్‌వర్క్‌ సంస్థ సింపుల్, టీ–హబ్‌ సంయుక్తంగా జూన్‌ 24న హైదరాబాద్‌లో కమ్యూనిటీ ఆధారిత స్టార్టప్‌ వ్యవస్థాపకుల సమావేశం డీ2సీ అన్‌లాక్డ్‌ను నిర్వహించనున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఎడిషన్‌లు నిర్వహించగా ఇది పదోది. ఇందులో డీ2సీ సంస్థల వ్యవస్థాపకులు.. బ్రాండ్‌లకు గుర్తింపు, డిజిటల్‌ మార్కెటింగ్‌ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ వ్యవస్థాపకుడు నందన్‌ రెడ్డి, సింపుల్‌ సహ వ్యవస్థాపకులు నిత్యా శర్మతో పాటు హైదరాబాదీ బ్రాండ్‌లయిన స్కిపీ ఐసాపాప్స్‌ సహ వ్యవస్థాపకులు రవి కాబ్రా, గేర్‌ హెడ్‌ మోటర్స్‌ వ్యవస్థాపకుడు నిఖిల్‌ గుండా, పిప్స్‌ సీఈవో ప్రశాంత్‌ గౌరిరాజు తదితరు పాల్గొంటారు. డీ2సీ బ్రాండ్లను నిర్మించడం, అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశ్రమలోని తోటి వారితో సమావేశమయ్యేందుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండగలదని నిత్యా శర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు