Sakshi News home page

కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

Published Fri, Feb 25 2022 10:04 AM

Daily Stock Market Update in Telugu February 25 - Sakshi

ముంబై : ఉక్రెయిన్‌పై రష్యా దాడితో గత మూడు రోజులుగా భారీగా నష్టపోయిన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం ఉదయం కోలుకుంది. గురువారం దేశీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు భారీగా పతనం అయ్యాయి. దీంతో షేర్ల ధరలు అందుబాటు ధరలో ఉన్నాయి. దీంతో యుద్ధ భయాలు నెలకొన్న, ద్రవ్యోల్బణం నీడలు వెంటాడుతున్న కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభం కావడంతోనే ఇటు సెన్సెక్స్‌, అటు నిఫ్టీలు లాభాల బాట పట్టాయి. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్‌ కొసాగుతుందా లేక వెంటనే లాభాలస స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది,

ఈ రోజు ఉయదం 10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1327 పాయింట్ల లాభంతో 2.43 శాతం వృద్దిని కనబరుస్తూ 55,857 పాయిం‍ట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 333 పాయింట్ల లాభంతో 16,581 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇండస్‌ ఇండ్‌, టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, విప్రో, ఐసీఐసీఐ, టీసీఎస్‌, ఎస్‌బీఐ, రిల్‌ షేర్లు లాభాలు పొందాయి. నిఫ్టీకి సంబంధించి  నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌, ఇండియా వీఐక్స్‌ షేర్లు లాభపడుతున్నాయి.

Advertisement
Advertisement