ఉద్రిక్తల నడుమ లాభాల్లో మార్కెట్‌ | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తల నడుమ లాభాల్లో మార్కెట్‌

Published Thu, Mar 3 2022 10:12 AM

Daily Stock Market Update In Telugu March 3 - Sakshi

ముంబై: ఉక్రెయిన్‌ - రష్యాల నడము యుద్ధ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఐనప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో పయణిస్తోంది. యూస్‌ మార్కెట్‌ని అండగా వెలువడిన ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయాలతో ఏషియన్‌ మార్కెట్లలో సానుకూల పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రభావం దేశీ మార్కెట్లపై కూడా పడింది. ఐటీ, ఎనర్జీ షేర్లు లాభాల బాట పట్టాయి. ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీలు అనిశ్చిత్త పరిస్థితుల మధ్య జోరు చూపిస్తున్నాయి.

ఈ రోజు ఉదయం పది గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 210 పాయింట్లు లాభపడి 55,678 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. అంతకు ముందు 55,996 పాయింట్ల గరిష్టాన్ని కూడా టచ్‌ చేసింది. 56 వేలు క్రాస్‌ చేయవచ్చనే అంచనాలు కూడా నెలకొన్నాయి. కానీ ఆ తర్వాత సెన్సెక్స్‌ నెమ్మదించింది. మరోవైపు నిఫ్టీ 16,778 పాయింట్ల హైఎండ్‌ని ఈ రోజు టచ్‌ చేసింది. పది గంటల సమయానికి 47 పాయిం‍ట్ల లాభంతో 16,653 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.

టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉండగా ఏషియన్‌ పేయింట్స్‌,  ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతి సుజూకి, నెస్టల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement