లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ | Sakshi
Sakshi News home page

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌

Published Tue, Jan 18 2022 9:16 AM

Daily Stock Market Updates In Telugu January 18 - Sakshi

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌ సూచీలు మిశ్రమ ఫలితాలు అందిస్తున్నాయి. అయితే డిసెంబరు నెలలో ఉద్యోగ నియమకాలు పెరిగినట్టుగా వెలువడుతున్న ఫలితాలు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది అనడానికి ఉదాహారణగా నిలిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా ఈ రోజు మార్కెట్‌లో సూచీలు లాభాల బాటలో ఉన్నాయి. 
 
ఉదయం 9:10 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 86 పాయింట్లు లాభపడి 61,308 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 18,337 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. క్రితం రోజు మార్కెట్‌ చాలా వరకు ఫ్లాట్‌గానే కొనసాగింది. కాగా ఈ రోజు ఉదయం నుంచే ఇన్వెస్టర్లకు లాభాలు అందిస్తోంది.
 

Advertisement
Advertisement