Sakshi News home page

Car Discounts On Diwali: దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు!

Published Mon, Oct 10 2022 3:12 PM

Diwali Festival Offer Hyundai Gives Rs 1 Lakh Discounts On Cars - Sakshi

అక్టోబర్‌ నెల రావడంతో పండగ కల వచ్చేస్తోంది. ప్రారంభంలో దసరాతో వచ్చి పోతూ పోతూ దీపావళితో ధూం ధాం చేసి వెళ్తుంది. పండుగా వస్తే చాలు.. ప్రజలు సాధారణ రోజుల కంటే ఈ రోజుల్లోనే కాస్త ఎక్కువగా షాపింగ్‌ చేస్తుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లకు హాయ్‌ చెబుతుంటాయి.

ఈ దీపావళి సందర్భంగా మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే.  పండుగ సీజన్‌లో పలు కంపెనీలు తమ కార్లపై భారీగా తగ్గింపులు, బెనిఫిట్స్‌ని ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai Motor India) తాజాగా మైండ్‌బ్లోయింగ్‌ ఆఫర్లను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మోడళ్లపై కళ్లుచెదిరే డీల్స్ అందిండంతో పాటు ఏకంగా రూ. లక్ష వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది.

హ్యుందాయ్ కోనా(Hyundai Kona Electric)
హ్యుందాయ్ కోనా కారు రూ. 1 లక్ష క్యాష్‌ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ఇటీవలే రెండు కొత్త కలర్స్‌ని కూడా లాంచ్‌ చేసింది.  కోనా ఎలక్ట్రిక్ ధర రూ. 23.84 లక్షల నుంచి 24.03 లక్షల మధ్య ఉంటుంది.


హ్యుందాయ్‌ గ్రాండ్ i10 నియోస్(Hyundai Grand i10 Nios)
కంపెనీ శాంట్రో నిలిపివేయడంతో, ప్రస్తుతం హ్యుందాయ్ ఎంట్రీ-లెవల్ మోడల్‌గా గ్రాండ్ i10 నియోస్ లాంచ్‌ చేసింది. దీని ధర రూ. 5.43 లక్షల నుంచి 8.45 లక్షల వరకు ఉంది. దీనిపై దాదాపు రూ. 48 వేల తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించింది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేల వరకు ఉంటుంది.

హ్యుందాయ్ ఐ20 (hyundai i20)
హ్యుందాయ్ ఐ20 (hyundai i20) కారుపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు ఉన్నాయి.  ఈ ఆఫర్‌లు i20 Magna, Sportz వేరియంట్‌లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఐ20 ధర రూ.7.07 లక్షల నుంచి రూ.11.62 లక్షల మధ్య ఉంది. ఉంటుంది. ఇక ఈ మోడల్‌పై కార్పొరేట్ డిస్కౌంట్లు లేవని తెలిపింది.

హ్యుందాయ్ ఆరా(Hyundai Aura)
హ్యుందాయ్ ఆరా మోడల్‌పై కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ కారుపై రూ. 33 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20 వేలు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు వంటివి కూడా కలిసి ఉన్నాయి. ఇతర వేరియంట్‌లు రూ. 18,000 వరకు గరిష్టంగా ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ ఆరా ప్రారంభ ధర రూ. 6.09 లక్షల నుంచి గరిష్టంగా 8.87 లక్షలు ఉంది.

గమనిక:పైన పేర్కొన్న ఆఫర్లు. నగరం లేదా రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు, మరిన్ని వివరాల కోసం మీ సమీప డీలర్‌షిప్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇవి పండుగ ఆఫర్లు కాబట్టి అక్టోబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

చదవండి: బ్యాంక్‌లో సేవింగ్స్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్‌!

Advertisement

What’s your opinion

Advertisement