మార్కెట్‌లో దూసుకుపోతున్న భారత్‌: ఈ నంబర్‌ ప్లేట్ల గురించి  తెలుసా? | Do You Know Different Types Of Number Plates In India And Its Significance - Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో దూసుకుపోతున్న భారత్‌: ఈ నంబర్‌ ప్లేట్ల గురించి  తెలుసా?

Published Sat, Aug 26 2023 11:40 AM

 Do you know DifferentTypes Of Number Plates India And Significance - Sakshi

జపాన్‌ను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌గా అవతరించింది.  దేశీయంగా వివిధ విభాగాలలో వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అమెరికా, చైనా తరువాత భారత్‌ ప్రముఖంగా నిల్తుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వాహనాల రక రకాల నెంబర్ ప్లేట్స్,  ఎందుకు ఉపయోగిస్తారు? తెలుసుకుందాం!

సాధారణంగా వాహనాలపై డిఫరెంట్ కలర్స్ గల నెంబర్ ప్లేట్స్ మనం  చూస్తూ ఉంటాం.  పలు రంగలుల్లో, ముఖ్యంగా గ్రీన్‌ కలర్‌లో ఉండే నెంబర్‌ ప్లేట్లను ఎపుడైనా చూశారా? తెలుగు, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల నెంబర్ ప్లేట్లు భారతదేశంలో ఉపయోగిస్తారు? అలాగే ప్రతి వాహనం ఒక ప్రత్యేక గుర్తింపుతో ఉంటుంది.  ప్లేట్‌పై  లాటిన్ అక్షరాలు , అరబిక్ నెంబర్లు బొమ్మల కలయికతో ఉంటాయి. ఎక్కువగా వైట్ నెంబర్ ప్లేట్స్ పై బ్లాక్ లెటర్స్‌,  పసుపు రంగు బోర్డు పై నల్ల అక్షరాలు లెటర్స్ మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఇంకా కొన్ని రకాల నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి.

తెల్లని నంబర్ ప్లేట్
ఇది భారతదేశంలో కనిపించే అత్యంత సాధారణ లైసెన్స్ ప్లేట్ రకం. రిజిస్ట్రేషన్ వివరాలు తెలుపు , నలుపు రంగులో ముద్రించబడతాయి. ఈ రకమైన రిజిస్ట్రేషన్ ప్లేట్ ప్రైవేట్ లేదా వాణిజ్యేతర వాహనాలపై కనిపిస్తుంది. అద్దెకు తీసుకోవడం లేదా సరుకు రవాణా వంటి వాణిజ్య ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించలేరు.

పసుపు నంబర్ ప్లేట్
తేలికపాటి మోటారు వాహనాలకు  ఇవి వర్తిస్తాయి. ఈ వాహనాలు ప్రైవేట్ వాహనాల కంటే భిన్నమైన పన్ను ప్లేట్స్‌ కలిగి ఉంటాయి. ఇంకా, అటువంటి వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.


రెడ్ నంబర్ ప్లేట్
తాత్కాలికి రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌. తెలుపు అక్షరాలతో ఎరుపు నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ వివరాలు  టెంపరరీని సూచిస్తుంది.  RTO  రిజిస్ట్రేషన్ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందే వరకు భారతదేశంలో రెడ్ నంబర్ ప్లేట్ ఉంటుంది. అయితే, రెడ్ నంబర్ ప్లేట్ ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది. చాలా రాష్ట్రాలు ఇలాంటి వాహనాలను తమ రోడ్లపైకి అనుమతించవు.

ఆకుపచ్చ నంబర్ ప్లేట్
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV)లకు బాగా ఆదరణ పెరుగుతోంది. ఈవీలకు కేటాయించే నెంబర్‌ ప్లేట్‌ గ్రీన్‌లోఉంటుంది. అందుకే దేశంలో  గ్రీన్ నంబర్ ప్లేట్లు పెరుగుతున్నాయి.  తెలుపు అక్షరాలతో ఉన్న అన్ని EVలు ప్రైవేట్ వాహనాలకు వర్తిస్తాయి. అయితే పసుపు అక్షరాలు ఉన్నవి  కమర్షియల్‌ EVలకు ప్రత్యేకం.

బ్లూ నంబర్ ప్లేట్
విదేశీ డిప్లొమేట్స్ వారు ఉపయోగించే వాహనాలకు వైట్‌ లెటర్స్‌తో  బ్లూ నెంబర్ ప్లేట్స్ ను అందజేస్తారు. ఇటువంటి నంబర్ ప్లేట్లు ప్రధానంగా మూడు కోడ్‌లలో దేనినైనా కలిగి ఉంటాయి- CC (కాన్సులర్ కార్ప్స్), UN (యునైటెడ్ నేషన్స్), లేదా CD (కార్ప్స్ డిప్లొమాటిక్). రాష్ట్ర కోడ్‌ను ప్రదర్శించడానికి బదులుగా, ఈ నంబర్ ప్లేట్‌లు దౌత్యవేత్తకు సంబంధించిన  దేశ కోడ్‌ను  తెలుపుతాయి.

పైకి సూచించే బాణంతో నంబర్ ప్లేట్
ఇటువంటి నంబర్ ప్లేట్లు ప్రత్యేకంగా సైనిక ప్రయోజనాల కోసం వాడతారు.  రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద నమోదవుతాయి. మొదటి లేదా రెండవ అక్షరం తర్వాత పైకి చూపే బాణాన్ని బ్రాడ్ బాణం అంటారు. బాణం తర్వాత వచ్చే అంకెలు వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. తదుపరిది బేస్ కోడ్, దాని తర్వాత క్రమ సంఖ్య. సీరియల్ నంబర్ తర్వాత వచ్చే చివరి అక్షరం వాహనం తరగతిని సూచిస్తుంది.

మిలిటరీ వెహికల్‌ నంబర్ ప్లేట్
భారతదేశ  అశోకా చిహ్నంతో కూడిన నంబర్ ప్లేట్లు భారత రాష్ట్రపతి లేదా రాష్ట్రాల గవర్నర్‌లకు మాత్రమే ప్రత్యేకం.

బ్లాక్‌  నంబర్ ప్లేట్
పసుపు అక్షరాలతో నలుపు రంగు నంబర్ ప్లేట్ సాధారణంగా విలాసవంతమైన హోటల్‌కు సంబంధించి లగ్జరీ కార్లకు కేటాయిస్తారు. అలాంటి వాహనాలను డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండనవసరం లేకుండానే వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తారు.

భారత్ సిరీస్
వివిధ రాష్ట్ర కోడ్‌లతో పాటు, ఒక సాధారణ పౌరుడు తన వాహనం కోసం 'BH' లేదా భారత్ సిరీస్ లైసెన్స్ ప్లేట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ రంగ ఉద్యోగులు, అలాగే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యాలయాలు ఉన్న సంస్థల ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

BH-సిరీస్-వాహనం-రిజిస్ట్రేషన్
వాహనం యజమాని కొత్త రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మకాం మార్చినప్పుడు, వాహనాన్ని తిరిగి నమోదు చేయడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడం ద్వారా అంతర్-రాష్ట్ర చలనశీలతను సులభతరం చేయడానికి ఈ నంబర్ ప్లేట్  తీసుకొచ్చారు.
 

Advertisement
Advertisement