బ్లాక్‌ బస్టర్‌ హిట్‌: రికార్డు సేల్స్‌, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు!

27 Sep, 2022 07:11 IST|Sakshi

బెంగళూరు: పండుగ సీజన్‌ కావడంతో ఈ కామర్స్‌ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా సంస్థలు పోటీ పడి మరీ వినియోగదారులకు ఊహించని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్‌ కామర్స్‌ కంపెనీ మీషో తమ మెగా బ్లాక్‌బస్టర్‌ సేల్‌ తొలి రోజున ఏకంగా 87.6 లక్షల ఆర్డర్లు నమోదు చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మీషో స్పందిస్తూ.. ఒకే రోజున ఇంత భారీ స్థాయిలో ఆర్డర్లు రికార్డు చేయడం ఇదే తొలిసారని, గతేడాదితో పోలిస్తే 80 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. మెగా బ్లాస్టర్‌ సేల్‌ మూడు రోజులు పూర్తవగా ఇప్పటికీ కస్టమర్లు నిమిషానికి వేలల్లో ఆర్డర్లు చేస్తున్నట్లు తెలిపింది.

ఈ పండుగ సీజన్‌ ఆర్డర్లతో ఫుల్‌ బిజీగా ఉన్నట్లు ట్వీట్‌ చేసింది మీషో. కాగా ఈ సంస్థ ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించడంతో పాటు భారీ స్థాయిలో మెగా బ్లాక్‌బస్టర్‌ సేల్‌ గురించి  ప్రచారం చేసింది. దీంతో అదే స్థాయిలో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. 85 శాతం పైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే వచ్చినట్లు సంస్థ సీఎక్స్‌వో ఉత్కృష్ట కుమార్‌ తెలిపారు.


ఫ్యాషన్, బ్యూటీ సాధనాలు, చీరలు మొదలుకుని వాచీలు, జ్యుయలరీ సెట్ల వరకూ 6.5 కోట్ల పైగా లిస్టింగ్స్‌ను అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!

మరిన్ని వార్తలు