ప్రింట్‌ మీడియాకు ఎన్నికల బూస్ట్‌..  | Sakshi
Sakshi News home page

ప్రింట్‌ మీడియాకు ఎన్నికల బూస్ట్‌.. 

Published Wed, Jul 12 2023 1:32 AM

Election boost for print media - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రింట్‌ మీడియా ఆదాయాలు 13–15 శాతం వృద్ధి చెంది రూ. 30,000 కోట్లకు చేరనున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారం కోసం ఇటు ప్రభుత్వాలు, అటు బ్రాండింగ్‌ కోసం కార్పొరేట్లు ప్రకటనలపై గణనీయంగా వెచ్చి ంచనుండటం ఇందుకు దోహదపడనుంది. రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తాము రేటింగ్‌ ఇచ్చే కంపెనీలను విశ్లేíÙంచిన మీదట ఈ అంచనాలకు వచ్చి నట్లు క్రిసిల్‌ పేర్కొంది.

ప్రింట్‌ మీడియా రంగం ఆదాయాల్లో ఈ సంస్థల వాటా 40 శాతం వరకూ ఉంటుందని వివరించింది. సాధారణంగా, ప్రింట్‌ మీడియా సంస్థల ఆదాయాల్లో 70 శాతం భాగం అడ్వర్టయిజింగ్‌ ద్వారా వస్తుండగా, మిగతా 30 శాతం సబ్ర్‌స్కిప్షన్ల ద్వారా వస్తోంది. ఆదాయాలు పెరగడం, న్యూస్‌ప్రింట్‌ ధరలు తగ్గుతుండటంతో ప్రింట్‌ మీడియా లాభదాయకత మెరుగుపడగలదని క్రిసిల్‌ తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరం 10 పర్సంటేజీ పాయింట్లు పెరిగి 14.5 శాతానికి చేరొచ్చని వివరించింది. ‘కీలక రంగాల్లోని కార్పొరేట్లు ప్రకటనలపై మరింతగా వెచ్చి ంచనుండటం, అలాగే రాబోయే రాష్ట్రాల, సార్వత్రిక ఎన్నికల కోసం ప్రభుత్వాలు కూడా యాడ్‌లపై ఖర్చు చేయనుండటం దేశీ ప్రింట్‌ మీడియా రంగం ఆదాయాలకు ఊతమివ్వగలదు. ప్రకటనలపరమైన ఆదాయంలో ప్రభుత్వ యాడ్‌ల వాటా అయిదో వంతు ఉంటుంది.

ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వాలు మరింతగా వెచ్చి ంచడం వల్ల ప్రింట్‌ మీడియా ఆదాయం మరింత పెరగగలదు‘ అని క్రిసిల్‌ డైరెక్టర్‌ నవీన్‌ వైద్యనాథన్‌ చెప్పారు. కరోనా మహమ్మారి దెబ్బతో 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రింట్‌ మీడియా ఆదాయాలు 40 శాతం పడిపోయాయి. అయితే, ఆ తర్వాత రెండు సంవత్సరాల్లోనూ పుంజుకుని వరుసగా 25%, 15% మేర వృద్ధి నమోదు చేశాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. 

రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, ఫ్యాషన్‌ ఆభరణాలు, కొత్త వాహనాల ఆవిష్కరణ, ఉన్నత విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యం, ఆన్‌లైన్‌ షాపింగ్, రియల్‌ ఎస్టేట్‌ మొదలైనవి ప్రింట్‌ మీడియా ప్రకటనల ఆదాయ వృద్ధికి దోహదపడనున్నాయి. ప్రింట్‌ మీడియా యాడ్‌ రెవెన్యూలో వీటి వాటా మూడింట రెండొంతులు ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రింట్‌ ఆదాయాలు తిరిగి కరోనా పూర్వ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. 

ప్రింట్‌ మీడియా కంపెనీలు, ముఖ్యంగా ఇంగ్లీష్‌ పత్రికలు, తమ ప్రీమియం డిజిటల్‌ కంటెంట్‌కు వసూళ్లు చేస్తున్నాయి.  

కవర్‌ ధరలు పెరగడంతో సబ్ర్‌స్కిప్షన్‌ ఆదాయం 7 శాతం పెరగనుంది. భౌతిక న్యూస్‌పేపర్లకు ప్రాధాన్యమిచ్చే పాఠకుల సంఖ్య పెరుగుతుండటానికి ఇది నిదర్శనం. అయితే, సబ్ర్‌స్కిప్షన్‌ వృద్ధి వల్ల న్యూస్‌ప్రింట్‌ అవసరం కూడా పెరిగి ప్రింట్‌ మీడియా లాభాలపై ప్రభావం పడుతోంది. భారత్‌ తన న్యూస్‌ప్రింట్‌ అవసరాల్లో సగానికి పైగా భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది.

ప్రధాన ఎగుమతిదారైన రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో లాజిస్టిక్స్‌పరమైన సవాళ్లు తలెత్తుతున్నాయి. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో న్యూస్‌ప్రింట్‌ రేట్లు 8.5 పర్సంటేజీ పాయింట్లు పెరిగి ప్రింట్‌ మీడియా కంపెనీల నిర్వహణ మార్జిన్లు తగ్గాయి. అయితే, ఇటీవలి కాలంలో గరిష్ట స్థాయి నుంచి న్యూస్‌ప్రింట్‌ ధరలు 15–20 శాతం మేర తగ్గాయి. ప్రింట్‌ మీడియా కంపెనీల లాభాలు పెరిగేందుకు ఇది దోహదపడనుంది. 

మధ్యకాలికంగా మార్జిన్లు మెరుగ్గానే ఉండవచ్చు. అయితే, న్యూస్‌ప్రింట్‌ రేట్లు పెరగడం, ప్రింట్‌ రంగాన్ని ప్రభావితం చేసేలా స్థూలఆర్థిక పరిస్థితులు మారడం తదితర రిసు్కలు ఉండొచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement