భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్‌ | Sakshi
Sakshi News home page

భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్‌

Published Sun, Apr 28 2024 2:16 PM

Elon Musk Heads To China In A Surprise Visit

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్‌ సారథ్యంలోని టెస్లా భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

కేంద్రం సైతం మస్క్‌ ఏప్రిల్‌ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది.  

అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ (ఎఫ్‌ఎస్‌డీ)కార్లలోని సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసేందుకు,ఎఫ్‌ఎస్‌డీ అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు  కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్‌లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.

మరోవైపు ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లపై ఎక్స్‌లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్‌ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్‌ కంట్రీలో ఎఫ్‌ఎస్‌డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు.  
 

Advertisement
Advertisement