వాట్సాప్ కి పోటీగా 'సిగ్నల్' యాప్

8 Jan, 2021 17:55 IST|Sakshi

వాట్సాప్ రెండు రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను అంగీకరించకపోతే వారి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 8 నుంచి పనిచేయదని సంస్థ పేర్కొంది. ఈ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్‌ సంబంధిత సర్వీసులతో యూజర్‌ డేటా పంచుకోవడమమనేది ముఖ్యమైన అంశం. యూజర్‌ వ్యక్తిగత‌ సమాచారం, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌, ఐపీ అడ్రస్‌ తదితర వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకోనుంది.(చదవండి: పెరిగిన షియోమీ స్మార్ట్ టీవీ ధరలు)

అయితే, ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి వాట్సాప్ యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర మెసెంజర్ యాప్ ల వైపు చూస్తున్నారు. ఇవి గోప్యతకు పరంగా కట్టుదిట్టంగా ఉంటాయి. టెస్లా సీఈఓ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ గురువారం వినియోగదారులను "సిగ్నల్ వాడండి" అని కోరారు. దీంతో ఒక్కసారిగా 'సిగ్నల్' మెసెంజర్ యాప్ డౌన్లోడ్ సంఖ్య భారీగా పెరిగింది. చాలా మంది కొత్త వ్యక్తులు సిగ్నల్ గ్రూప్ లింక్‌ ద్వారా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరడానికి ప్రయత్నించడంతో యాప్లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు "సిగ్నల్" సంస్థ ట్వీట్ చేసింది. గ్రూప్ లింక్‌ను ఉపయోగించి ఇతర మెసెంజర్ యాప్ ల నుంచి సిగ్నల్ యాప్కి చేరుకోవడానికి ఏ విధంగా చేరుకోవాలో తెలియజేసే గైడ్‌ను కంపెనీ విడుదల చేసింది. రెండు యాప్ ల మధ్య యూజర్లు తమ చాట్‌లను తరలించలేరని గమనించాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు