టీసీఎస్ బాటలో హెచ్‌సీఎల్‌ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు..

15 Feb, 2024 14:22 IST|Sakshi

కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా చాలామందికి ఇంటి నుంచే ఉద్యోగం చేయడానికి సుముఖత చూపుతూ.. ఆఫీసులకు రావడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్ణింగ్ ఇచ్చేసింది. ఈ బాటలో ఇప్పుడు హెచ్‌సీఎల్‌ అడుగులు వేస్తోంది.

హెచ్‌సీఎల్‌ టెక్ కంపెనీ ఇప్పుడు తమ ఉద్యోగులను తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. హెచ్‌సీఎల్‌ ఉద్యోగి ఎవరైనా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.

కొత్త నిబంధనలు 2024 ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టంగా చేసింది. దీంతో ఉద్యోగులు 19వ తేదీ నుంచి తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయాలని ఆదేశించాయి.

అన్ని విభాగాల్లోని ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా ఆఫీసుకు రావాలని హెచ్‌సీఎల్‌ టెక్ పీపుల్స్ ఫంక్షన్స్ గ్లోబల్ హెడ్ వికాస్ శర్మ ఆదేశిస్తూ.. ఈ నెల 14న మెయిల్స్ పంపినట్లు సమాచారం. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే జీతం లేకుండా సెలవు తీసుకున్నట్లు (లాస్ ఆఫ్ పే) ప్రకటించే అవకాశం ఉన్నట్లు మేనేజ్‌మెంట్ హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ!

ఆఫీసులకు రావడమే కాకుండా ఉత్పాదక కూడా పెంచాలని యాజమాన్యం ఆదేశిస్తున్నట్లు సమాచారం. అంటే ఉద్యోగులు రోజుకు సగటున కనీసం 8 గంటలు పనిచేయాలని చెబుతున్నారు. 8 గంటలపాటు ల్యాప్‌టాప్ యాక్టివిటీ నమోదు కాని సందర్భంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు