అలెర్జీలకు చెక్ పెట్టే యంత్రం - ధర రూ. 10795 మాత్రమే! | Sakshi
Sakshi News home page

అలెర్జీలకు చెక్ పెట్టే యంత్రం - ధర రూ. 10795 మాత్రమే!

Published Sun, Jul 23 2023 10:26 AM

Estonia respire allergy filter mission price and details - Sakshi

వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్‌హేలర్‌లే గతి. 

అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్‌ వేర్‌’ పేరుతో అలెర్జీ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు.

(ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం.. ఇలాగే జరిగితే చైనా కంపెనీల కథ కంచికే!)

ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్ష్మాతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్‌ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్‌ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement