విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు నేరుగా విమానాలు | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు నేరుగా విమానాలు

Published Thu, Feb 1 2024 9:28 PM

Flight Services Starts In April Form Visakhapatnam Airport  - Sakshi

విశాఖపట్నం: విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు ఏప్రిల్ నుంచి ఎయిరేషియా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-బ్యాంకాక్ విమాన సర్వీసులు మొదలవుతాయి. ఏప్రిల్ 26 నుంచి విశాఖ-కౌలాలంపూర్ కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-హైదరాబాద్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు నడవనుంది. 

మే, జూన్ లో విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్ట్ రన్‌వే నవీకరణ పనులు మార్చి 31 నాటికి పూర్తికానున్నాయి. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి.

ఇదీ చదవండి: Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే..

Advertisement

తప్పక చదవండి

Advertisement