Flipkart Plan To Delivers 25,000 Electric Vehicles In Its Supply By 2030 - Sakshi
Sakshi News home page

డెలివరీ : ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం

Published Thu, Feb 25 2021 8:21 AM

Flipkart to deploy 25,000 Electric Vehicles by 2030 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. సరుకు డెలివరీకి ఎలక్ట్రిక్‌ వాహనాలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద బ్యాటరీతో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత, గువాహటి, పుణే తదితర నగరాల్లో వినియోగిస్తోంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 25,000 పైచిలుకు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ద్వారా కస్టమర్లకు సరుకు డెలివరీ చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇందుకోసం తమ లాజిస్టిక్స్‌ భాగస్వాముల ద్వారా హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా ఎలక్ట్రిక్, పియాజియోతో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీల వాహనాలను వినియోగించనున్నారు. ఎలక్ట్రిక్‌ వాహన వినియోగం పెరిగేందుకు లాజిస్టిక్స్‌ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని ఫ్లిప్‌కార్ట్‌ ఈకార్ట్, మార్కెట్‌ప్లేస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమితేశ్‌ ఝా తెలిపారు. ఇక డెలివరీ హబ్స్, కార్యాలయాల్లో చార్జింగ్‌ స్టేషన్లను కంపెనీ అందుబాటులోకి తేనుంది. 

Advertisement
Advertisement