అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది: అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్‌

30 Jan, 2023 17:00 IST|Sakshi

సాక్షి,ముంబై: అదానీ గ్రూప్-అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్ వివాదం మరింత రాజు కుంటోంది. అదానీ గ్రూప్‌ ఇచ్చిన సమాధానికి హిండెన్‌బర్గ్  సోమవారం తిరిగి కౌంటర్‌ ఇచ్చింది.  జాతీయవాదం పేరుతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నిస్తోందని ఆరోపించింది.  అదానీ గ్రూప్‌ తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధిని,  చైర్మన్  గౌతం అదానీ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోందంటూ దుయ్యబట్టింది. వారి సమాధానంతో ఏకీభవించడం లేదని, అసలు చాలా ప్రశ్నలకు సమాధానమే చెప్పలేదని  హిండెన్‌బర్గ్  వాదించింది.

దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటూ భారత జెండాను కప్పుకున్న అదానీ గ్రూప్ భారతదేశ భవిష్యత్తును అడ్డుకుంటోందని  ఆరోపించింది. భారత దేశం శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశమని, అది సూపర్ పవర్‌గా ఎదుగుతోందని, కానీ అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోందని విశ్వసిస్తున్నట్లు  పేర్కొంది. అంతేకాదు జాతీయవాదం లేదా తాము లేవనెత్తిన ప్రతి ప్రధాన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా  కప్పిపుచ్చి మోసాన్ని అడ్డుకోలేరంటూ  స్పందించడం గమనార్హం.  (రానున్న బడ్జెట్‌ సెషన్‌లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు