ఫ్యూచర్‌ రిటైల్‌: అంబానీ, అదానీకి పోటీగా కంపెనీలు నువ్వా? నేనా? | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ రిటైల్: అంబానీ, అదానీకి పోటీగా కంపెనీలు, నువ్వా? నేనా?

Published Thu, Nov 24 2022 12:45 PM

FRL bidding race 13 companies enter in final list - Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్‌ రిటైల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కొనుగోలు రేసులో మొత్తం 13 కంపెనీలు నిల్చాయి. దీనికి సంబంధించి రూపొందించిన తుది జాబితాలో ముఖేశ్‌ అంబానీ రిలయన్స్‌ రిటైల్, అదానీ గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఏప్రిల్‌ మూన్‌ రిటైల్‌తో పాటు మరో 11 కంపెనీలు ఉన్నాయి. నవంబర్‌ 10న విడుదల చేసిన ప్రొవిజనల్‌ లిస్టుపై రుణ దాతల నుండి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆయా కంపెనీలను తుది జాబితాలోనూ చేర్చినట్లు ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) వెల్లడించారు. (బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ కీలక ఆదేశాలు)

ఎఫ్‌ఆర్‌ఎల్‌ రుణ భారం రూ. 24,713 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సినది రూ. 21,433 కోట్లు కాగా, ఆపరేషనల్‌ క్రెడిటర్లకు రూ. 2,464 కోట్ల మేర కట్టాలి. రుణాల చెల్లింపులో డిఫాల్ట్‌ కావడంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా .. ఎఫ్‌ఆర్‌ఎల్‌పై దివాలా పిటీషన్‌ వేసింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ సహా 19 ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల టేకోవర్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రయత్నించినా.. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సాధ్యపడలేదు. (Bisleri చైర్మన్‌ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్‌)

Advertisement
Advertisement