బంగారం కొనుగోళ్లు... ఇదే మంచి తరుణమా? | Sakshi
Sakshi News home page

Gold Rate today: బంగారం కొనుగోళ్లు... ఇదే మంచి తరుణమా?

Published Fri, Feb 9 2024 11:52 AM

gold rate today feb 9 - Sakshi

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఊరటనిచ్చాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధర ఈరోజు (ఫిబ్రవరి 9) స్వల్పంగా తగ్గింది. దీంతో ఈరోజు బంగారం కొనేవారికి ధరలు కాస్త దిగివచ్చినట్లయింది.

బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.

హైదరాబాద్‌ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.57,900 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.70 చొప్పున దిగొచ్చి రూ.63,160 వద్ద ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో..
♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.57,900 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.63,160 వద్దకు చేరింది.

♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యల్పంగా రూ.10 తగ్గి రూ.58,390లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.10 చొప్పున తగ్గి రూ.63,710 ఉంది.

♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.58,050 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.20 తగ్గి రూ.63,310 వద్ద ఉంది.

♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.57,900 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.63,160 వద్దకు చేరింది.

cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరిగాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.76,500 వద్ద ఉంది. ఇది క్రితం రోజున రూ. 76,000 లుగా ఉండేది.

Advertisement
Advertisement