‘బెంగళూరు గోల్డ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌’లో మెరిసిన జీఆర్‌టీ కస్టమర్లు

18 Jan, 2024 04:19 IST|Sakshi

బెంగళూరు: అతిపెద్ద గోల్డ్‌ షాపింగ్‌ పండుగ ‘బెంగళూరు గోల్డ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌’లో జీఆర్‌టీ జ్యువెలర్స్‌ కస్టమర్లు మెరిశారు.

పండుగ సీజన్‌లో ‘జ్యుయెలర్స్‌ ఆసోసియేషన్‌ బెంగళూర్‌’ నిర్వహించిన బంపర్‌ ప్రైజ్, లక్కీ డ్రా పోటీల్లో 177 మంది జీఆర్‌టీ జ్యువెలర్స్‌ కస్టమర్లు 20 గ్రాముల బంగారం నాణేల నుంచి 1 కేజీ వెండి వరకూ బహుమతులు గెలుపొందినట్లు కంపెనీ తెలిపింది. విజేతలందకీ జీఆర్‌టీ జ్యువెలర్స్‌ సంస్థ ఎండీలు జీఆర్‌ ఆనంద్‌ అనంతపద్మనాభన్, జీఆర్‌ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు