Good News HDFC Bank Cuts MCLR By Up To 85 BPS EMIs To Go Down - Sakshi
Sakshi News home page

ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌: రుణాలపై భారీగా తగ్గనున్న భారం 

Published Tue, Apr 11 2023 8:49 PM

Good News HDFC Bank cuts MCLR by up to 85 bps EMIs to go down - Sakshi

సాక్షి,ముంబై:  ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది.  ఇటీవలి కాలంలో రుణాలపై వడ్డీరేట్ల పెంపుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లను తగ్గించి భారీ ఊరటనిచ్చింది.మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని 85 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఫలితంగా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది.

బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం,   సవరించిన రుణ రేట్లు ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు తర్వాత బ్యాంకు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 40 బేసిస్ పాయింట్లు తగ్గి 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.7 శాతానికి దిగొచ్చింది.  మరోవైపు 1-3 ఏళ్ల కాలానికి చెందిన ఎంసీఎల్ఆర్ స్థిరంగా ఉంటాయని బ్యాంకు  ప్రకటించింది. కాగా రివ్యూలో ఆర్బీఐ  కీలక వడ్డీ రేట్లనుయథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే. (‘ఆడి చాయ్‌వాలా’ ఏమైంది భయ్యా? వైరల్‌ వీడియో)

ఇదీ చదవండి: Lava Blaze-2: అదిరిపోయే ఫీచర్లు: పరిచయ ఆఫర్‌ చూస్తే ఫిదా!

Advertisement
Advertisement