ఎల్పీజీ సిలిండర్‌ వినియోగదారులకు కేంద్రం శుభవార్త!?

27 Jul, 2021 13:18 IST|Sakshi

ఎల్పీజీ సిలిండర్‌ వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై వంట గ్యాస్‌ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్‌ ను ఎంపిక చేసుకోవచ్చని, అక్కడి నుంచే గ్యాస్‌ సిలిండర్‌ పొంద వచ్చని ప్రకటించింది.  పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా... ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌కి సంబంధించి  వినియోగదారులు ఎదుర్కొంటున్న  కష్టాల్ని ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనికి  కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్‌  స్పందిస్తూ... ‘ ఇకపై వంట గ్యాస్‌ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్‌ ను ఎంపిక చేసుకోవచ్చని, వారి వద్ద నుంచే సిలిండర్‌ ను ఫిల్‌ చేయించుకోవ‍చ్చు’ అని ప్రకటించారు.

 పైలట్‌ ప్రాజెక్టుగా 
ఇప్పటి వరకు సిలిండర్‌ వినియోగదారులు ఒక్క డిస్టిబ్యూటర్‌ వద్ద మాత్రమే గ్యాస్‌ ఫిల్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ డిస్ట్రిబ్యూటర్‌ దగ్గర నుంచైనా గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చుకునే వెసులుబాటును పైలట్‌ ప్రాజెక్టుగా చండీగడ్‌, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీలలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్‌ చేసిన ప్రకటనతో ఈ పథకం దేశమంతటా అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మొత్తంగా  కేంద్రం తాజా  నిర్ణయం గ్యాస్‌ వినియోగదారులకు ఊరట కలిగించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు