హావెల్స్‌ ఇండియా లాభం డౌన్‌ | Sakshi
Sakshi News home page

హావెల్స్‌ ఇండియా లాభం డౌన్‌

Published Thu, Oct 20 2022 6:56 AM

Havells India: Q2 Net Profit Rs 187 Cr, Revenue Rises - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కన్జూమర్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ దిగ్గజం హావెల్స్‌ ఇండియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 187 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 302 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం వృద్ధితో రూ. 3,679 కోట్లను అధిగమించింది.

గత క్యూ2లో రూ. 3,238 కోట్ల టర్నోవర్‌ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 21 శాతం ఎగసి రూ. 3,274 కోట్లకు చేరాయి. కమోడిటీ ధరల కారణంగా వ్యయాలు పెరగడంతో మార్జిన్లు బలహీనపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్‌ రాయ్‌ గుప్తా పేర్కొన్నారు. కేబుళ్ల విభాగం అమ్మకాలు రూ. 1,359 కోట్లను దాటగా.. స్విచ్‌ గేర్ల నుంచి రూ. 488 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు. ఇక మొత్తం ఆదాయంలో ఎలక్ట్రికల్‌ కన్జూమర్‌ గూడ్స్‌ నుంచి రూ. 773.5 కోట్లు, లైటింగ్‌ తదితరాల నుంచి రూ. 402 కోట్లు చొప్పున లభించినట్లు వెల్లడించారు. లాయిడ్‌ కన్జూమర్‌ అమ్మకాలు రూ. 420 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో హావెల్స్‌ ఇండియా షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 1,248 వద్ద ముగిసింది.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఊహించని షాక్‌.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!

Advertisement
Advertisement