హీటింగ్, వెంటిలేషన్, ఏసీలకు డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

హీటింగ్, వెంటిలేషన్, ఏసీలకు డిమాండ్‌

Published Sat, Feb 17 2024 3:08 PM

Heating, ventilation, and AC market may reach Rs 1.78 trn - Sakshi

నోయిడా: మౌలికరంగ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తుండడంతో రానున్న రోజుల్లో హీటింగ్, వెంటిలేషన్, ఏసీ (హెచ్‌వీఏసీ) రంగానికి అసాధారణ వృద్ధి అవకాశాలు రానున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మౌలిక రంగానికి 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం తెలిసిందే.

యాక్రెక్స్‌ ఇండియా 23వ ఎడిషన్‌ కార్యక్రమం సందర్భంగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై 1.45 ట్రిలియన్‌ డాలర్లను ఖర్చు చేయనుండడంతో అసాధారణ వృద్ధికి అవకాశాలున్నట్టు హెచ్‌వీఏసీ పరిశ్రమ మండలి ‘ఐఎస్‌హెచ్‌ఆర్‌ఏఈ’ ప్రెసిడెంట్‌ యోగేష్‌ ఠాకూర్‌ తెలిపారు. సీ, రిఫ్రిజిరేషన్‌ రంగంలో పర్యావరణ అనుకూల విధానాల అమలుకు ఈ కార్యక్రమ తోడ్పడుతుందని ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇండియా ఎండీ యోగేష్‌ ముద్రాస్‌ పేర్కొన్నారు.

ఐఎస్‌హెచ్‌ఆర్‌ఏఈ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనూప్‌ బల్లే మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గింపునకు, నైపుణ్యాల అభివృద్ధికి పరిశ్రమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 2030 నాటికి 10 లక్షల జనాభాను మించిన పట్టణాలు 42 నుంచి 68కి పెరుగుతాయని, ఇది సీ సిస్టమ్‌లకు డిమాండ్‌ను పెంచుతుందని క్యారియల్‌ ఇండియా ఎండీ సంజయ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రస్తుతం దేశ ఎయిర్‌ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్‌ రంగం 9 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నట్టు వోల్టాస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ముకందన్‌ మీనన్‌ పేర్కొన్నారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement