వన్‌ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్

23 Nov, 2020 15:57 IST|Sakshi

భారత్‌లో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతుంది. గత నెలలో వన్‌ప్లస్ 8టీ స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసిందో లేదో అప్పుడే తర్వాత వన్‌ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై రూమర్లు వస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ 9ప్రో డిజైన్‌కు సంబంధించి ఫస్ట్ లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ ప్రకారం వన్‌ప్లస్ 9ప్రో యొక్క డిజైన్ వనిల్లా వెర్షన్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కర్వ్డ్ 6.7-అంగుళాల డిస్‌ప్లే, సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్ హోల్ కటౌట్‌తో రానున్నట్లు సమాచారం.

వాల్యూమ్ బటన్ ఫోన్ కి ఎడమ వైపున ఉండగా, పవర్ బటన్ కుడి వైపున ఉన్నాయి. వెనుకవైపు, నాలుగు కెమెరా లెన్స్‌లతో సమానమైన దీర్ఘచతురస్రాకార కెమెరా ప్యానెల్ ఉంది. వన్‌ప్లస్ 9 సిరీస్‌ ఫోన్‌లో 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ వాడనున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం మార్చిలో కొత్త వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ తీసుకొస్తుందో లేదో చూడాలి. (చదవండి: ట్విటర్ ఫ్లీట్స్‌లో భారీ లోపం)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు