అయోధ్యలో హూటల్‌ రూం ధర లక్ష! | Sakshi
Sakshi News home page

జోరందుకున్న టూరిజం.. అయోధ్యలో ఒక్క హూటల్‌ రూం ధర లక్ష రూపాయలు

Published Sun, Jan 21 2024 9:28 AM

Hotel Costs In Ayodhya Jump Up To Rs 1 Lakh Per Night - Sakshi

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది.

ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 7,000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

హోటల్‌లో ఒక్క రూమ్‌ ధర లక్ష
రాముడి సుగుణాలు అనేకం.. ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన నాటి నుంచి అయోధ్య రూపు రేకలు మారిపోయాయి. ముఖ్యంగా టూరిజం రంగం అనూహ్యంగా వృద్ది సాధిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక బాలరాముడు దర్శనం కోసం భక్తులు అయోధ్యకు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ తరుణంలో అయోధ్యలోని హోటల్ ధరలు రాత్రికి రూ. లక్షకు పెరిగాయంటూ పలు వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఐదు రెట్లు పెరిగిన అద్దెలు
అద్దెలు సగటు కంటే ఐదు రెట్లు పెరిగాయి. అందుకు స్థానికంగా ఉన్న పార్క్‌ ఇన్‌ రాడిసన్‌ హోటల్‌ టాప్‌ రూమ్‌ ధర రూ.లక్ష మార్క్‌ దాటినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా ఉన్న హోటల్‌ రామాయణ ప్రతినిధులు మాట్లాడుతూ.. జనవరి 20-25 మధ్యలో హోటల్ గదులు పూర్తిగా బుక్‌ అయ్యాయి. పార్క్ ఇన్ హోటల్, డిసెంబర్ మధ్య నుండి బుకింగ్‌ల జోరందుకుంది.

అందుబాటులోకి హోమ్‌ స్టేలు
రామమందిరం కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, రామమందిరం ప్రారంభమైన తర్వాత హోటల్‌ గదలు ధరలు రాత్రికి రూ. 7,000 నుండి రూ. 25,000 వరకు పెరిగాయని సిగ్నెట్ కలెక్షన్ హోటల్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో అనేక హోమ్‌స్టేలు కూడా వచ్చాయి. రూ.4 వేల నుంచి సరసమైన ధరకే గదులు అందిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Advertisement
Advertisement