అదిరిపోయే డివైజ్‌, పడుకున్న ఐదు నిముషాలకే గురక పెడుతున్నారా?

14 Aug, 2022 08:50 IST|Sakshi

నిద్రలో గురక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. గురక పెట్టే వారి కంటే, వారితో కలసి ఒకే గదిలో పడుకునేవారికి మరింత సమస్య. చాలామంది గురక నివారణ కోసం ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. వాటి ఫలితం అంతంత మాత్రమే! జీవితాంతం గురకతో బాధపడాల్సిందేనా అని బెంగపడే వారి కోసం తాజా సాధనం అందుబాటులోకి వచ్చింది.

ఫొటోలో కనిపిస్తున్నది అదే! చూడటానికి కెటిల్‌లా ఉంది, దీనితో గురక నివారణేమిటా అనుకుంటున్నారా? నిజమే! ఇది ఎలక్ట్రిక్‌ కెటిలే! అయితే, కాఫీ, టీలు కాచుకునే కెటిల్‌ కాదిది. గురక బాధితుల శ్వాసవ్యాయామాల కోసం ఫిన్లాండ్‌లోని టుర్కు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కెటిల్‌ ఇది.

‘వెల్‌ ఓ2’ పేరుతో రూపొందించిన ఈ కెటిల్‌ వెలుపలి వైపు ఉండే గొట్టం ద్వారా ఒక్కో విడతకు 10–15 సెకన్ల సేపు గాలి ఊదుతూ వ్యాయామం చేసినట్లయితే, మెడ, ఛాతీ కండరాలు బలపడి గురక బాధ శాశ్వతంగా తప్పుతుందని చెబుతున్నారు. దీని ధర 244.80 డాలర్లు (రూ.19,250) మాత్రమే! 

మరిన్ని వార్తలు